coolie | రజనీకాంత్ కూలీ పార్ట్2 ఉందా!

రజనీకాంత్ హీరోగా లోకేశ్ క‌న‌గ‌రాజ్ దర్శకత్వంలో నాగార్జున, అమీర్ ఖాన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శృతి హాసన్ వంటి స్టార్స్ నటించిన కూలీ సినిమా ఈనెల 14న విడుదల కానుంది

coolie  | రజనీకాంత్  కూలీ పార్ట్2 ఉందా!

విధాత : రజనీకాంత్ హీరోగా లోకేశ్ క‌న‌గ‌రాజ్ దర్శకత్వంలో నాగార్జున, అమీర్ ఖాన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శృతి హాసన్ వంటి స్టార్స్ నటించిన కూలీ సినిమా ఈనెల 14న విడుదల కానుంది. ఇప్పటికే కూలీ సినిమా విడుదలకు ముందే హిట్ టాక్ తెచ్చుకుని భారీ అంచనాలను పెంచేసింది. అయితే ఈ సినిమా ఎంతమేరకు హిట్ అవుతుంది..ఎన్ని వందల కోట్లు సాధిస్తుందన్న అంచనాలు పక్కన పెడితే…ఈ సినిమాకు సీక్వెల్ గా పార్ట్ 2 కూడా ఉండబోతుందన్న సమాచారం హాట్ టాపిక్‌గా మారింది. సంగీత దర్శకుడు అనిరుధ్ కూలీ పార్ట్2 లో కలుద్దాం అంటూ పెట్టిన పోస్టుతో సినిమాకు పార్ట్2 ఉంటుందని తేలిపోయింది. సినిమా అద్భుతంగా వచ్చిందని.. మనం కూలీ పార్ట్ 2 కోసం తిరిగి కలుస్తామని ఆశిస్తున్నానని అనిరుధ్ పోస్టు చేశారు. అయితే కూలీ పార్టీ 2పై దర్శక నిర్మాతలు, హీరో రజనీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కూలీ పార్ట్ 2పై దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా మాస్టర్ 2, లియో 2 తీసేందుకు ఆసక్తిగా ఉన్నారని సమాచారం.