Coolie OTT : 11నుంచి..ఓటీటీలోకి రజనీకాంత్ ‘కూలీ’
రజనీకాంత్ హీరోగా ‘కూలీ’ మూవీ 11నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో.

విధాత: సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో నాగార్జున, సౌబిన్ షాహిర్ లు కీలక పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కూలీ’(Coolie) ఈనెల 11నుంచి ఓటీటీలో(OTT) స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ప్రైమ్ వీడియోలో(Amazon Prime Video) ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి స్పెషల్ పోస్టర్ వదిలారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఓటీటీలో కూలీ అందుబాటులోకి రానుందని తెలిపారు. అయితే హిందీ వర్షన్ రిలీజ్ గురించి మాత్రం ఎటువంటి అప్‌డేట్ ఇవ్వకపోవడం గమనార్హం.
ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కూలీ మూవీ(Coolie Movie) బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ మూవీ వార్ 2ను అధిగమించి మంచి వసూళ్లు సాధించి ఫర్వాలేదనిపించింది. సన్ పిక్చర్స్(Sun Pictures) బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన కూలీ చిత్రంలో శృతి హాసన్, సత్యరాజ్, రచిత రామ్ ముఖ్య పాత్రలు పోషించారు. హీరోయిన్ పూజా హెగ్డే మోనికా అనే స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.లోకేష్ కనకరాజ్ సినిమాను తనకు అచ్చివచ్చిన జోనర్ లోనే మాఫియా, డ్రగ్స్, అక్రమ వ్యాపారాల చుట్టు సాగే కథకు ఎమోషన్స్ జోడించి కొత్తగా రూపొందించారు.