Kannappa OTT Release : ఓటీటీలోకి వచ్చేసిన మంచు విష్ణు కన్నప్ప
మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్. తెలుగు సహా ఐదు భాషల్లో విడుదలై పాజిటివ్ టాక్ అందుకుంది.
విధాత : మంచు విష్ణు(Manchu Vishnu ) ప్రధాన పాత్రంలో నటించిన భక్తిరస చిత్రం ‘కన్నప్ప’(Kannappa) ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో(Amazon Prime Video) కన్నప్ప తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ సినిమాను మంచు మోహన్ బాబు నిర్మించగా.. మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్‌కుమార్(శివుడు), కాజల్ అగర్వాల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
మోహన్‌బాబు మూవీలో వాయులింగం పరిరక్షుడిగా మహదేవశాస్త్రిగా ప్రత్యేక పాత్రలో కనిపించారు. అలాగే విష్ణు ఇద్దరు కూతుళ్లు, కొడుకు కూడా సినిమాలో నటించారు. శ్రీకాశహస్తీ శైవ క్షేత్రం స్థల పురాణ నేపథ్యంలో శివభక్తుడు కన్నప్ప పురాణ కథతో రూపొందిన ఈ సినిమా పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కన్నప్ప(తిన్నడు) పాత్రలో విష్ణు, తిన్నడి భార్యగా ప్రితీముకుందన్ నటించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram