Toxic Movie : కేజీఎఫ్ యష్..రూ.600కోట్లతో “టాక్సిక్ ” మూవీ!

కేజీఎఫ్ యష్ కొత్త చిత్రం “టాక్సిక్” రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Toxic Movie : కేజీఎఫ్ యష్..రూ.600కోట్లతో “టాక్సిక్ ” మూవీ!

Toxic Movie | విధాత : కేజీఎఫ్(KGF) సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిన కన్నడ హీరో యష్(Yash) తన తదుపరి చిత్రం “టాక్సిక్ –ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్”(Toxic- A Fairy Tale For Grown Ups) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కేజీఎఫ్ 2(KGF-2) భారీ విజయం తర్వాత యష్ అనూహ్యంగా మహిళా దర్శకురాలు గీతూ మోహ‌న్‌దాస్ తో “టాక్సిక్ ” మూవీ ప్రకటించి అందరిని యష్ అశ్చర్యపరిచారు. “టాక్సిక్ (Toxic)” మూవీ పాన్ వరల్డ్ టార్గెట్ గా రూపొందుతుంటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకురాలు గీతా మోహన్ దాస్(Geetu Mohandas) ఈ సినిమాను భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్ లోను విడుదల చేసేలా షూటింగ్ లో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ జేజే పెర్రీ(JJ Perry) కొరియోగ్ర‌ఫీలో తాజాగా 45రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్ ముంబైలో కొనసాగుతుంది. సినిమాలో కీలకంగా ఉండే ఈ యాక్షన్ ఎపిసోడ్ ను భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయేలా తీసేందుకు పెర్రీ ప్రయత్నిస్తున్నట్లుగా వెలువడుతున్న వార్తలు సినిమాపై ప్రేక్షకులలో మరింత ఆసక్తిని కల్గిస్తున్నాయి.

అయితే సినిమా బడ్జెట్ రూ.600కోట్లకు చేరుకుందని..యాష్ మార్కెట్ కు ఇంత భారీ ఖర్చుతో నిర్మిస్తున్న టాక్సిక్ మూవీ ఆశించిన రీతిలో లేకపోతే మాత్రం అంతే స్థాయిలో భారీ దెబ్బ పడటం ఖాయమని..హిట్ అయితే అంతకంత వసూళ్లు సాధించడం తధ్యమని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దర్శకురాలు గీతా మోహన్ దాస్ ను(Geetu Mohandas) కాదని..యష్ స్వయంగా సినీ నిర్మాణంలో వేలు పెట్టి రీషూట్ ల..నటీ నటుల మార్పులు వంటి కారణాలతో బడ్జెట్ పెంచినట్లుగా సినీ వర్గాల టాక్. యష్(Yash) ప్రస్తుతం బాలీవుడ్ రామాయణం సినిమాతో పాటు మరో మూవీలో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్(KVN Productions), మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె. నారాయణ(Venkat K. Narayana), యష్ సంయుక్తంగా నిర్మిస్తున్న గ్యాంగ్ స్టర్ కథా చిత్రం “టాక్సిక్– ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్” మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.