Hamsa Mahapurusha Yoga | 100 ఏండ్ల తర్వాత దీపావళి నాడు హంస మహా పురుష రాజయోగం..! ఈ 3 రాశుల వారికి ప్రతి పనిలో విజయమే..!!
Hamsa Mahapurusha Yoga | ఈ ఏడాది జరుపుకునే దీపావళి( Diwali ) పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ పర్వదినం వేళ.. ఓ ప్రత్యేక యోగం ఏర్పడబోతోంది. దాదాపు 100 ఏండ్ల తర్వాత ఏర్పడబోతున్న యోగమే.. హంస మహా పురుష రాజయోగం( Hamsa Mahapurusha Yoga ). ఈ యోగం ఏర్పడడం కారణంగా ఈ మూడు రాశుల( Zodiac Signs ) వారికి ప్రతి పనిలో విజయం( Success ) చేకూరనుంది. మరి ఆ మూడు రాశులు ఏంటో తెలుసుకుందాం.
Hamsa Mahapurusha Yoga | ఈ దీపావళి( Diwali ) పండుగ ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజు ప్రారంభమై కార్తీక శుద్ధ విదియ రోజున ముగుస్తుంది. అంటే ఈ పండుగను ఐదు రోజులు జరుపుకోవాలన్న మాట. అప్పుడే పండుగ సంపూర్ణంగా పూర్తయినట్టు. ఇక దీపావళి వేళ ప్రతి ఇల్లు, ప్రతి గల్లీ, ప్రతి ఆలయం.. దీపాలతో కళకళలాడిపోతుంది. అంతేకాదు.. ఆ నాలుగైదు రోజుల పాటు బాణసంచా కాల్చుతూ పిల్లలు ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ప్రధానంగా ఈ దీపావళి వేళ అతిముఖ్యమైనది లక్ష్మీదేవి( Lakshmi Devi ) పూజ. భక్తులందరూ కూడా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసి.. తమ భక్తిని చాటుకుంటారు.
ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ దీపావళి రోజున.. ఒక ప్రత్యేక యోగం ఏర్పడబోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దాదాపు వందేండ్ల తర్వాత హంస మహా పురుష రాజయోగం( Hamsa Mahapurusha Yoga )ఏర్పడబోతుందని చెబుతున్నారు. అంటే గురు బృహస్పతి తన సొంత రాశి అయిన కర్కాటకంలోకి సంచరిస్తాడట. దీంతో హంస మహా పురుష రాజయోగం ఏర్పడుతుందని పండితులు పేర్కొంటున్నారు. ఈ యోగం అక్టోబర్ 20వ తేదీన దీపావళి వేళ ఏర్పడుతుంది. దీంతో ఈ మూడు రాశుల( Zodiac Signs ) వారికి చేపట్టిన ప్రతి పనిలోనూ విజయమే వరిస్తుందని, వీరికి తిరుగు లేదని, శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి ఆ మూడు రాశులేంటో తెలుసుకుందాం..
తులా రాశి( Libra )
హంస మహా పురుష రాజయోగం తులా రాశి వారికి పదో స్థానంలో ఏర్పడుతుంది. ఈ కారణంగా ఈ రాశి వారు ఏ పని చేపట్టిన విజయం లభిస్తుంది. కొత్త బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. గతంలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. అలాగే ఆర్థికంగా కూడా లాభం ఉంటుంది. ఈ సమయంలో డబ్బు ఆదా అవుతుంది.. ప్రేమ జీవితంలో కూడా సమతుల్యత వస్తుంది. వివాహితుల జీవితంలో కొంత సానుకూలత వస్తుంది.
కర్కాటక రాశి( Cancer )
కర్కాటక రాశి వారికి కూడా హంస మహా పురుష రాజయోగం అద్భుతంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈ యోగం వారి లగ్నస్థానంలో ఏర్పడుతుంది కాబట్టి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. వ్యక్తిత్వంలో కూడా మెరుగుదల ఉంటుంది. ఎంతో కాలంగా చేస్తున్న ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కొత్త ఒప్పందాలు పొందే అవకాశం ఉంది, అదే సమయంలో అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు.
వృశ్చిక రాశి( Scorpio )
వృశ్చిక రాశిలో ఈ హంస మహా పురుష యోగం తొమ్మిదవ స్థానంలో చురుకుగా ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. ఈ యోగం ప్రభావంతో ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశాలుంటాయి. ఇప్పటివరకు ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. వృత్తిలో కొత్త అవకాశాలు వస్తాయి మరియు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో సామరస్యత కూడా పెరుగుతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram