Indian Railways | ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం.. ప్లాట్‌ఫామ్స్ టికెట్స్ రద్దు..!
Indian Railways | భారతీయ రైల్వే బోర్డు( Indian Railways )కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ రైల్వేస్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులకు ఊరటనిస్తుంది. ఎందుకంటే ప్లాట్‌ఫామ్ టికెట్స్( Platform Tickets )ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులు( Railway Passengers ) సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Indian Railways | దీపావళి( Diwali ), ఛట్ పూజ( Chhath Puja ) నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రయాణాలు అధికంగా కొనసాగే అవకాశం ఉంది. దీంతో రైల్వే స్టేషన్లు( Railway Stations ) రద్దీగా మారనున్నాయి. రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసి పోనున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులకు వెసులుబాటు కల్పించే విధంగా భారతీయ రైల్వే బోర్డు( Indian Railways ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పండుగల నేపథ్యంలో ప్రయాణికుల( Railway Passengers ) రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ప్లాట్ ఫామ్ టికెట్స్( Platform Tickets )ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే అధికారులు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా మొత్తం 15 రైల్వే స్టేషన్లలో( Railway Stations ) ఈ వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 28వ తేదీ వరకు ప్లాట్‌ఫామ్ టికెట్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, రైల్వే బోర్డు మార్గదర్శకాల ప్రకారం, సీనియర్ సిటిజన్లు, అనారోగ్య ప్రయాణికులు, పిల్లలు, సహాయం అవసరమైన మహిళా ప్రయాణీకులకు ప్లాట్‌ఫామ్ టిక్కెట్లు జారీ చేయబడతాయని పేర్కొన్నారు.
ప్లాట్‌ఫామ్ టికెట్స్ రద్దు.. ఈ స్టేషన్లలోనే
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్(New Delhi railway station)
ఢిల్లీ రైల్వే స్టేషన్(Delhi railway station)
హజ్రత్ నిజాముద్దీన్(Hazrat Nizamuddin)
ఆనంద్ విహార్ టెర్మినల్(Anand Vihar Terminal)
ఘజియాబాద్ (Ghaziabad)
బాండ్రా టెర్మినస్ (Bandra Terminus)
వాపి(Vapi)
సూరత్(Surat)
ఉధ్నా(Udhna)
ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్(Chhatrapati Shivaji Maharaj Terminus)
దాదర్ (Dadar)
లోకమాన్య తిలక్ టెర్మినస్(Lokmanya Tilak Terminus)
థానే(Thane)
కళ్యాణ్(Kalyan)
పాన్వెల్(Panvel)