Chandrababu Naidu| దీపావళి వేళ చంద్రబాబు మరో తీపి కబురు
దీపావళి పండుగ వేళ ఇప్పటికే ఉద్యోగస్తులకు డీఏ కానుక అందించిన ఏసీ సీఎం చంద్రబాబు నాయుడు పరిశ్రమదారులకు మరో కానుక ప్రకటించారు. తొలి విడతగా రూ.1500 కోట్ల పారిశ్రామిక రాయితీల విడుదలకు చంద్రబాబు ఆదేశాలిచ్చారు.
అమరావతి : దీపావళి(Diwali) పండుగ వేళ ఇప్పటికే ఉద్యోగస్తులకు డీఏ కానుక అందించిన ఏసీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పరిశ్రమదారులకు మరో కానుక (Diwali Gift) ప్రకటించారు. పరిశ్రమలకు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్(Industrial Incentives) విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. తొలి విడతగా రూ.1500 కోట్ల పారిశ్రామిక రాయితీల విడుదలకు చంద్రబాబు ఆదేశాలిచ్చారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో భాగస్వాములైన పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. పరిశ్రమలకు మద్దతుగా, వ్యాపారాలకు ఏపీని గమ్యస్థానంగా నిలిపేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో చిన్న, మధ్య తరహా వ్యాపారులకు భారీ ఊరట లభించనుంది. పేదలకు సంక్షేమ పథకాలు, పెట్టుబడులతో ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక చెల్లింపులు, వ్యాపారస్తులకు ప్రోత్సాహకాలు అందిస్తూ అన్ని వర్గాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఈ సందర్బంగా టీడీపీ పేర్కోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram