Ganesh Chaturthi Puja Timings | రేపే కొలువుదీర‌నున్న గ‌ణ‌నాథులు.. విఘ్నేశ్వ‌రుడి పూజ‌కు శుభ స‌మ‌య‌మిదే..!

Ganesh Chaturthi Puja Timings | ఆది దంపతులు శివ, పార్వతుల మొదటి కుమారుడైన గణపయ్య( Ganesh )ను పూజించనిదే ఏ పని కూడా మొదలుపెట్టరు. వినాయకుడి కృప ఉంటే అన్నీ విజయాలే లభిస్తాయనేది ప్రజల విశ్వాసం. మ‌రి గ‌ణ‌నాథుడిని పూజించేందుకు( Ganesh Chaturthi Puja Timings ) శుభ స‌మ‌యం ఏంటో తెలుసుకుందాం.

Ganesh Chaturthi Puja Timings | రేపే కొలువుదీర‌నున్న గ‌ణ‌నాథులు.. విఘ్నేశ్వ‌రుడి పూజ‌కు శుభ స‌మ‌య‌మిదే..!

Ganesh Chaturthi Puja Timings | విఘ్నాల‌ను తొల‌గించే విఘ్నేశ్వ‌రుడి జ‌న్మ‌దినాన్నే గ‌ణేశ్ చ‌తుర్థి(Ganesh Chaturthi )గా జ‌రుపుకుంటారు భ‌క్తులు. అయితే ప్ర‌తి ఏడాది ఈ వినాయ‌క చ‌వితి( Vinayaka Chavithi )ని భాద్ర‌ప‌ద మాసం శుక్ల‌ప‌క్షం చ‌వితి రోజున గొప్ప‌గా, భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకోనున్నారు. ఈ ఏడాది ఆగ‌స్టు 27న గ‌ణ‌నాథుడు చ‌వితి పూజ‌లు అందుకోనున్నారు. మ‌రి ఈ రోజున ఏ స‌మ‌యంలో పూజ చేయాలి..? ఎలాంటి వ‌స్త్రాలు ధ‌రించి పూజ‌లు చేయాల‌నే విష‌యాల‌ను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

విఘ్నేశ్వ‌రుడి పూజ‌కు శుభ స‌మ‌యం ఇదే..

వినాయ‌క చ‌వితి రోజున ప్ర‌త్యేక స‌మ‌యంలో వ‌ర‌సిద్ధి వినాయక వ్రత కల్పం(varasiddi vinayaka vrata kalpam ) చేసుకుంటే లంబోద‌రుడి సంపూర్ణ అనుగ్రహం ల‌భిస్తుంద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆగస్టు 27 బుధవారం తెల్ల‌వారుజామున 5 గంటల 20 నిమిషాల నుంచి 7 గంటల 20 నిమిషాల వరకు స్థిర లగ్నం(సింహ లగ్నం) ఉంది. ఈ స‌మ‌యం వినాయ‌కుడి పూజకు చాలా శుభకరం అని చెబుతున్నారు. ఈ సమయంలో దీపం పెట్టుకొని పూజ ప్రారంభించుకోవడం చేయాలంటున్నారు. అయితే, ఉదయం పూజ చేసుకోలేని వారు మళ్లీ స్థిర లగ్నం(వృశ్చిక లగ్నం) ఉన్నస‌మ‌యం​లో అంటే ఉదయం 11 గంటల 35 నిమిషాల నుంచి 11 గంటల 50 నిమిషాల మధ్యలో వరసిద్ధి వినాయక వ్రత కల్పం చేసుకుంటే అత్యంత శుభ ఫలితాలు సొంతం చేసుకోవచ్చంటున్నారు.

మ‌రి ఏ రంగు వ‌స్త్రాలు ధ‌రించాలి..?

ఈ ఏడాది బుధ‌వారం రోజున వినాయ‌క చ‌వితి వ‌చ్చింది. ఇక‌ బుధవారానికి అధిపతి అయిన బుదుడికి, ఆయన అధిష్టాన దైవమైన వినాయకుడికీ ఆకుపచ్చ రంగు( Green Colour ) అంటే చాలా ఇష్టం. కాబట్టి, ఈ సంవత్సరం అందరూ బుధవారంతో కూడిన గణేశ్ చతుర్థి రోజు ఇద్దరికి ఎంతో ప్రీతిపాత్రమైన ఆకుపచ్చ రంగు కలిగిన దుస్తులు ధరించి లంబోద‌రుడిని పూజిస్తే విఘ్నేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం ల‌భించి అద్భుతమైన ఫలితాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. అలాగే, ఆకుపచ్చ రంగు వస్త్రాలు లేని వారు కనీసం గ్రీన్ కలర్ ఖర్చీఫ్​ లేదా ఏదైనా చిన్న వస్త్రం దగ్గర పెట్టుకొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే మంచిద‌ని సూచిస్తున్నారు జ్యోతిష్య పండితులు.