Real Life Rancho | రియల్ లైఫ్‌లో ‘3 ఇడియట్స్’ సినిమా!

రియల్ లైఫ్‌లో '3 ఇడియట్స్' సినిమా క్లైమాక్స్ మాదిరిగానే ఓ ఘటన జరిగింది. కదులుతున్న రైలులో పురిటి నొప్పులు వచ్చిన మహిళకు వికాస్ బింద్రే అనే యువకుడు రైల్వే ప్లాట్‌ఫామ్‌పై డెలివరీకి సహాయం చేశాడు. తల్లి, బిడ్డ సురక్షితం.

Real Life Rancho | రియల్ లైఫ్‌లో ‘3 ఇడియట్స్’ సినిమా!

విధాత : బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ ‘3 ఇడియట్స్’ సినిమాలోని సన్నివేశాన్ని తలపించే ఘటన రియల్ లైఫ్ లోనూ చోటుచేసుకుంది. ఆ సినిమా క్లైమాక్స్‌లో హీరోయిన్ సోదరి ప్రసవానికి హీరో ఆమిర్ ఖాన్ సహాయం చేసినట్లే..నిజ జీవితంలో ఓ రైల్వే ప్లాట్‌ఫామ్‌పై.. ఒక మహిళ డెలివరీకి ఓ యువకుడు చేసిన సహాయం వైరల్ గా మారింది. కదులుతున్న రైలులో ఒక మహిళకి పురుటి నొప్పులు రావడంతో.. సహాయం కోసం కేకలు వేసింది.

అందరూ ఏం చేయాలన్న షాక్‌లో ఉండగా.. వికాస్ బింద్రే అనే యువకుడు తాను ముందుకొచ్చి ఎమర్జెన్సీ చైన్‌ను లాగాడు. రామ్ మందిర్ స్టేషన్ వద్ద రైలు ఆపేసి.. ప్లాట్‌ఫామ్ మీదకి ఆ మహిళను తీసుకొచ్చి వీడియో కాల్‌లో ఓ మహిళా డాక్టర్ సూచనల మేరకు.. డెలివరీకి సహాయం చేశాడు. ఆ మహిళ అక్కడే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లితో పాటు బిడ్డ సురక్షితంగా ఉన్నారు. వికాస్ చేసిన ఈ పనికి గాను.. రియల్ లైఫ్ రాంచో అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.