సైడ్ బిజినెస్ కోసం పోతే మెయిన్ ఉద్యోగం పోయింది.. ఉపాధ్యాయుడు లక్ష్మణ్‌పై సస్పెండ్ వేటు
ఖమ్మం నగరంలో తనకు పోటీగా క్రాకర్స్ షాపు పెట్టినందుకు యజమానిపై బూతులతో విరుచుకు పడి, చంపేస్తామంటూ దాడి చేసిన టీచర్ లక్ష్మణ్‌పై సస్పెండ్ వేటు పడింది.
విధాత: ఖమ్మం నగరంలో తనకు పోటీగా క్రాకర్స్ షాపు పెట్టినందుకు యజమానిపై బూతులతో విరుచుకు పడి, చంపేస్తామంటూ దాడి చేసిన టీచర్ లక్ష్మణ్‌పై సస్పెండ్ వేటు పడింది. నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి పాఠశాల స్కూల్ అసిస్టెంట్‌గా పని చేసిన లక్ష్మణ్.. ప్రస్తుతం డీఈవో ఆఫీసులో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నాడు. విధులు వదిలేసి క్రాకర్స్ బిజినెస్ చేస్తున్నాడు. ఈ నెల 11న ఖమ్మంలో తనకు పోటీగా మరో వ్యక్తి క్రాకర్స్ షాపు పెట్టడంతో అతనిపై గొడవకు దిగాడు. దీంతో లక్ష్మణ్ వ్యవహారంపై ఫిర్యాధులు అందడంతో అప్రమత్తమైన జిల్లా విద్యాధికారిణి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ అతనిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram