Srikanth Iyengar | మహాత్మా గాంధీపై నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ అనుచిత వ్యాఖ్యలు
నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ మహాత్మా గాంధీపై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చట్టపరమైన చర్యలకు డిమాండ్లు.

విధాత : మహాత్మా గాంధీపై టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కృష్ణస్వామి అయ్యంగర్ అలియాస్ శ్రీకాంత్ భరత్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ గా మారింది. మహాత్మా గాంధీతో స్వాతంత్ర్యం రాలేదని..సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి ఎందరో లక్షల యోధుల పోరాటాలతోనే స్వాతంత్ర్యం వచ్చిందని శ్రీకర్ భరత్ అన్నారు. వాళ్లు పరమాత్ములని..గాంధీ కాదన్నారు. మహాత్మా గాంధీ అసలు జాతిపిత కాదని..మనం భారత మాత అంటామన్నారు. ఆయన ఎందరో మహిళలను, యువతులను లైంగిక వేధించాడని ఆరోపించారు. అభ్యంతకర భాషతో మహత్మా గాంధీని దుర్భాషలాడాడు. మహాత్మా గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ శ్రీకర్ భరత్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆయనపై చట్టపర చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇటీవల టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ సైతం కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై విమర్శలు చేసి..ఆ వెంటనే యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే.
Dare to WATCH?!?!?!
THE TRUTH!!!!!!! pic.twitter.com/0Y0kO2cvDP
— Shrikanth BHARAT (@Shri__Bharat) October 6, 2025