Mumbai Metro| ముంబై మెట్రోలో సైకిల్ పార్కింగ్ వైరల్
ముంబై మెట్రో రైలులో సైకిల్ పార్కు చేసిన వీడియో వైరల్ గా మారింది. ముంబై మెట్రో తమ కోచ్ లలో ప్రయాణించే వారికి పార్కింగ్ కోసం ఓ కోచ్ ని ఏర్పాటు చేసింది.

న్యూఢిల్లీ : ముంబై మెట్రో రైలులో(Mumbai Metro) సైకిల్ పార్కు(Bicycle Parking) చేసిన వీడియో వైరల్ గా మారింది. ముంబై మెట్రో తమ కోచ్ లలో ప్రయాణించే వారికి పార్కింగ్ కోసం ఓ కోచ్ ని ఏర్పాటు చేసింది. ఈ కోచ్ లో ప్రయాణికులు తమ సైకిల్‌ను పార్కింగ్ చేసుకునే వసతి కల్పించారు.
ఇందుకోసం కోచ్ కార్నర్‌లో ఓ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. సైకిల్ తో ప్రయాణించిన ఓ యువతి తన సైకిల్ పార్కింగ్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు..అసలు ఇది ఇండియా మెట్రోలో కాదు.. జర్మనీలాంటి దేశాల్లో జరిగింది అనుకున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ముంబై మెట్రోలో ఇప్పటికే పసుపు లైన్ (2ఏ), ఎరుపు లైన్ (7)లో అధికారికంగా అందుబాటులో ఉండటం విశేషం. ఎటువంటి అదనపు చార్జీలు లేకుండానే సైకిల్ ను తీసుకెళ్లే వసతి అమలులో ఉండటం గమనార్హం.