PM Kisan | రైతులకు గుడ్‌న్యూస్.. మార్చి 13న ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు!

PM Kisan | ఉగాది పండుగ ముందు రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 22వ విడత పెట్టుబడి సాయాన్ని మార్చి 13వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

PM Kisan | రైతులకు గుడ్‌న్యూస్.. మార్చి 13న ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు!

PM Kisan | ఉగాది పండుగకు ముందు రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించిన తేదీని ప్రకటించింది. 22వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 13వ తేదీన విడుదల చేస్తారని కేంద్రం వెల్లడించింది. అసోంలోని గువాహటిలో నిర్వహించనున్న కార్యక్రమంలో పెట్టుబడి సాయం డబ్బులను మోదీ విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందనున్నారు.

రైతులకు పెట్టుబడి సాయం కింద ఆర్థిక భరోసా కల్పించేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధిపథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.6వేల పంట సాయం అందిస్తున్నారు. ఈ డబ్బులను ఏటా మూడు విడుతల్లో రూ.2వేల చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ఇప్పటివరకు పీఎం కిసాన్ పథకం కింద 21 విడతల్లో డబ్బులు పంపిణీ చేశారు. తాజాగా మార్చి 13వ తేదీన 22వ విడత డబ్బులను విడుదల చేయనున్నారు. ఈ దఫాలో మొత్తం రూ.19వేల కోట్లను రైతుల ఖాతాలో జమ చేయనున్నారు.

కాగా, పీఎం కిసాన్ పథకం కింద రైతులు రూ.2వేలు పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారులు సూచించారు. ఒకవేళ ఇంకా ఎవరైనా ఈ కేవైసీ చేయించుకోకపోతే వెంటనే పూర్తి చేసుకోవాలన్నారు. ఇక రీవెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా అక్రమంగా పీఎం కిసాన్ నిధులు పొందుతున్న వారిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. పలువురిని లబ్దిదారుల జాబితాలో నుంచి తొలగించింది.

Read More: