హైలైట్స్:

  • సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
  • మేడిగడ్డను సందర్శించిన మంత్రి
  • గత కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై విమర్శలు

విధాత ప్రత్యేక ప్రతినిధి:

2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం జరుగుతున్న సాంకేతిక పరీక్షల పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 2014 కంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రూ. 38వేల కోట్లతో చేపట్టినట్లు తెలిపారు. అందులో భాగంగానే దాదాపు 11 వేల కోట్ల రూపాయల పనులు పూర్తి కాగా దాదాపు 30 శాతం పని జరిగిందని తెలిపారు. 2014 తరువాత ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వం కావాలనే ప్రాజెక్టు డిజైన్ మార్పు చేసి మేడిగడ్డ ప్రాజెక్ట్ రూపకల్పన చేసినట్లు తెలిపారు. 16.50 లక్షలు ఎకరాలకు సాగునీరు అందించేచేందుకు చేపట్టిన ప్రాజెక్టు పనులు కావాలనే గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చేయడం వల్ల ఇబ్బంది కలిగిందని, తప్పుడు నిర్ణయాలతో ప్రాజెక్టు కాలయాపన చేశారని తెలిపారు. దాదాపు రూ. 1,45,000 కోట్లతో మేడిగడ్డ బ్యారేజీ పనులు చేపట్టారని బ్యారేజీ లోపభూయిష్టమైన నిర్మాణం వల్ల కుంగిందని తెలిపారు.

ప్రాజెక్టు కుంగడానికి గల కారణాలను లోతుగా విశ్లేషణ చేసేందుకు సీడబ్ల్యూసీ, ఎన్డిఎస్ఏ వంటి ప్రతిష్టాత్మకమైన అనుభవం కలిగిన సంస్థలచే సాంకేతికంగా అత్యంత పకడ్బందీ పరీక్షలు నిర్వహించి ప్రాజెక్టు వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. అన్నారం, సుందిదళ్ల బ్యారేజీ మరమ్మతులు పనులు చేపట్టినట్లు తెలిపారు. పునరుద్ధరణ పనులు చేయడానికి డిసైడ్ అండ్ డిజైన్ కన్సల్టెంట్ గా ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఆఫ్రీన్ అనే కంపెనీని సంప్రదించి ఐఐటి బాంబే నిపుణులతో సంయుక్తంగా రీ డిజైన్ చేపట్టేందుకు పనులు చేస్తున్నారని తెలిపారు. ఎన్ది ఎస్ఏ పరీక్షలు నిర్వహిస్తూ ఉపయోగవంతంగా ముందుకెళుతున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరు వరకు గానీ జూలై మొదటి వారం వరకు కాని అన్ని పరీక్షలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. వచ్చిన పరీక్షలు నివేదిక ఆధారంగా బ్యారేజ్ పునరుద్ధరణ డిజైన్ చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. డిజైన్ అంత సిద్ధమైన తదుపరి సిడబ్ల్యుసి, ఎన్ డి ఎస్ ఏ అనుమతి తీసుకొని ఈ వర్షాకాలం పూర్తి కాగానే సుమారు నవంబర్ డిసెంబర్ మాసాలలో పనులు మొదలుపెట్టి ఒక వర్కింగ్ సీజన్లో పనులు పూర్తి చేసే ప్రయత్నం చేసి 2027 ఎండాకాలం వరకు పనులు పూర్తి చేయడానికి ఒక లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు.

"2014 తరువాత ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వం కావాలనే ప్రాజెక్టు డిజైన్ మార్పు చేసి మేడిగడ్డ ప్రాజెక్ట్ రూపకల్పన చేసింది. 16.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టు పనులను కావాలనే గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చేయడం వల్ల ఇబ్బంది కలిగింది. తప్పుడు నిర్ణయాలతో ప్రాజెక్టు కాలయాపన చేశారు. దాదాపు రూ.1,45,000 కోట్లతో మేడిగడ్డ బ్యారేజీ పనులు చేపట్టారు. బ్యారేజీ లోపభూయిష్టమైన నిర్మాణం వల్ల కుంగింది."

- నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

ఈ కార్యక్రమానికి భారత సైన్యంలో అత్యంత నైపుణ్యం, అనుభవం కలిగిన కల్నల్ పరిషిత్ మెహ్రా చైర్మన్ ఆధ్వర్యంలో ముందుకు పోతున్నట్లు తెలిపారు. కమిటీలో చాలామంది దేశ విదేశాల నుంచి నిపుణులను పెట్టి ఈ పరీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. పరీక్షలు ఎక్కడ వరకు వచ్చాయో పురోగతిని తనిఖీ చేసేందుకు వచ్చినట్లు తెలిపారు. పునరుద్ధరణ పనులు ప్రారంభించడానికి ముందే ప్రతి బ్యారేజ్ యొక్క ఫిజికల్ కండిషన్ తనిఖీ చేస్తూ సమస్యలు ఉంటే మరమ్మతులు చేసేందుకు కార్యచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. తనిఖీల కేంద్రాలకు వెళ్ళిన తర్వాత ఎనర్జీ డిస్ప్లేస్మెంట్ కూడా పరిశీలన చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, ఇరిగేషన్ సెక్రెటరీ శ్రీధర్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి సిరిశెట్టి సంకీర్త్, సీఈ శ్రీనివాస్ గుప్తా, ఆర్డిఓ రవీందర్, ఇరిగేషన్ ఎస్ఈ దస్తగిరి, ఈఈ రమేష్, కన్సల్టెంట్ ఈఈ యాదగిరి, గ్రంధాలయ చైర్మన్ రాజబాబు, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపిడిఓ సురేందర్, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల తదితరులు పాల్గొన్నారు.