Telangana liquor shop applications| 2,620 వైన్స్ లు..ఇప్పటికే 50వేలు దాటిన దరఖాస్తులు

తెలంగాణలో మద్యం దుకాణాల దరఖాస్తుల ప్రక్రియకు అనూహ్య స్పందన వస్తుంది. దరఖాస్తుల గడువు శనివారంతో ముగియ్యబోతుండగా..ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,620వైన్స్ లకు ఏకంగా 50వేలకు పైగా దరఖాస్తుల వచ్చాయి.

Telangana liquor shop applications| 2,620 వైన్స్ లు..ఇప్పటికే 50వేలు దాటిన దరఖాస్తులు

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో మద్యం దుకాణాల దరఖాస్తుల(Telangana liquor shop applications) ప్రక్రియకు అనూహ్య స్పందన వస్తుంది. దరఖాస్తుల గడువు శనివారంతో ముగియ్యబోతుండగా..ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,620వైన్స్ లకు ఏకంగా 50వేలకు పైగా దరఖాస్తుల వచ్చాయి. శుక్రవారం ఒక్క రోజునే 25వేల దరఖాస్తులు వచ్చినట్లుగా ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి. దరఖాస్తు ఫీజు నాన్ రీఫండబుల్ గా రూ.3లక్షలుగా నిర్ణయించినప్పటికి భారీగా దరఖాస్తులు రావడం గమనార్హం. దీంతో ప్రభుత్వానికి దరఖాస్తుల రూపంలో భారీగానే ఆదాయం దక్కబోతుంది.

అయితే రిజర్వ్ డ్ దుకాణాలకు తక్కువ దరఖాస్తులు రావడం..కొన్నిచోట్ల వ్యాపారులు సిండికెట్ కారణంగా..ఒకటి రెండు దరఖాస్తులకే పరిమితమవ్వడంతో .. దరఖాస్తుల గడువు పెంపు చేయాలా వద్ద అన్నదానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. వచ్చిన దరఖాస్తుదారుల నుంచి లాటరీ పద్దతిలో దుకాణాలను కేటాయిస్తారు. ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి 2027 నవంబరు 30 వరకు(రెండేళ్లపాటు) ఈ లైసెన్స్ విధానం అమల్లో ఉంటుంది.