Teachers Transfers | టీచర్ల బదిలీల షెడ్యూల్‌ విడుదల.. 3నుంచి 5వరకు దరఖాస్తులు

Teachers Transfers | విధాత: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రకియ షెడ్యూల్‌ ప్రకటించింది. నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని పేర్కోంది. 6, 7తేదీలలో వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన కాపీలను డీఈవో కార్యాలయంలో సమర్పించాలి. 8, 9 తేదీలలో దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను ప్రకటిస్తారు. 10, 11తేదీల్లో అభ్యంతరాలను స్వీకరిస్తారు. 12,13తేదీలలో సీనియార్టీ […]

  • By: krs    latest    Sep 01, 2023 4:57 PM IST
Teachers Transfers | టీచర్ల బదిలీల షెడ్యూల్‌ విడుదల.. 3నుంచి 5వరకు దరఖాస్తులు

Teachers Transfers |

విధాత: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రకియ షెడ్యూల్‌ ప్రకటించింది. నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని పేర్కోంది. 6, 7తేదీలలో వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన కాపీలను డీఈవో కార్యాలయంలో సమర్పించాలి.

8, 9 తేదీలలో దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను ప్రకటిస్తారు. 10, 11తేదీల్లో అభ్యంతరాలను స్వీకరిస్తారు. 12,13తేదీలలో సీనియార్టీ జాబితాను ప్రచురిస్తారు. 14వ తేదీన ఎడిట్‌ చేసుకునేందుకు అవకాశమిస్తారు. 15న ఆన్‌లైన్‌ ద్వారా ప్రధానోపాధ్యాయుల బదిలీలు నిర్వహిస్తారు. 16న ప్రధానోపాధ్యాయుల ఖాళీలను ప్రదర్శిస్తారు.

17,18తేదీలలో స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పిస్తారు. 20,21తేదీల్లో ఖాళీయైన స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రకటిస్తారు. 21వ తేదిన వెబ్ ఆప్షన్ల ఎంపిక నిర్వహిస్తారు. 22వ తేదీన ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. 23,24తేదీలలో స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు నిర్వహిస్తారు. 24న స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలను వెల్లడిస్తారు.

26,27,28తేదీలలో ఎస్‌జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌ పదోన్నతులు కల్పిస్తారు. 29,30, 31తేదీలలో ఎస్‌జీటీ ఖాళీల వివరాలు తెలియచేస్తారు. ఆక్టోబర్ 2వ తేదిన ఎడిట్ ఆప్షన్ అవకాశం కల్పిస్తారు. ఆక్టోబర్ 3వ తేదిన ఎస్‌జీటీ, భాషా పండితులు, పీఈటీల బదిలీలు నిర్వహిస్తారు.ఆక్టోబర్ 5వ తేదీ నుంచి 19వ తేది వరకు ఆప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.