Nidhhi Agerwal| ఒక సినిమా షూటింగ్‌ ఆంధ్రాలో, మరొకటి తెలంగాణలో… కిక్కిచ్చే న్యూస్ చెప్పిన నిధి

Nidhhi Agerwal| యంగ్ హీరోయిన్ నిధి అగ‌ర్వాల్‌కి మంచి అందం, అదిరిపోయే అభిన‌యం ఉన్నా కూడా ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేక‌పోయింది. కుర్ర హీరోల స‌ర‌స‌న న‌టించి మంచి స‌క్సెస్ లు అందుకుంటూ ఉన్న ఈ భామ ఇప్పుడు ఇద్ద‌రు పెద్ద హీరోల సర‌స‌న ఛాన్స్ కొట్టేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌పర‌చింది. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత నిధి అగ‌ర్వాల్ ఫేట్ మారింది. ఈ భామ‌కి ముందుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న హ‌రిహర వీర‌మ‌ల్లు సిని

  • By: sn    cinema    Oct 17, 2024 4:35 PM IST
Nidhhi Agerwal| ఒక సినిమా షూటింగ్‌ ఆంధ్రాలో, మరొకటి తెలంగాణలో… కిక్కిచ్చే న్యూస్ చెప్పిన నిధి

Nidhhi Agerwal| యంగ్ హీరోయిన్ నిధి అగ‌ర్వాల్‌(Nidhhi Agerwal)కి మంచి అందం, అదిరిపోయే అభిన‌యం ఉన్నా కూడా ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేక‌పోయింది. కుర్ర హీరోల స‌ర‌స‌న న‌టించి మంచి స‌క్సెస్ లు అందుకుంటూ ఉన్న ఈ భామ ఇప్పుడు ఇద్ద‌రు పెద్ద హీరోల సర‌స‌న ఛాన్స్ కొట్టేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌పర‌చింది. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత నిధి అగ‌ర్వాల్ ఫేట్ మారింది. ఈ భామ‌కి ముందుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న హ‌రిహర వీర‌మ‌ల్లు (Harihara veeramallu)సినిమాలో న‌టించే అవ‌కాశం ద‌క్కింది. ఈ అవ‌కాశంతో ఎగిరి గంతేసిన నిధికి మ‌రో గోల్డెన్ అవ‌కాశం అందింది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న రాజాసాబ్(Rajasaab) చిత్రంలోను నిధి క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అయితే ఒకే రోజు రెండు బిగ్ బడ్జెట్ చిత్రాల్లో నటించడం అంటే ఈ రోజుల్లో అంత సాధారణమైన విషయం కాదు.

కాని నిధి అగ‌ర్వాల్ ఆ టాస్క్‌ను ఎంతో సాఫీగా పూర్తి చేయగలిగింది. రెండు సినిమాల్లో నటించడం గురించి తాజాగా నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు పాన్‌ ఇండియా సినిమాలు.. ‘హరిహరవీరమల్లు’ , ‘రాజా సాబ్‌’లలో తాను నటిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అని తెలియ‌జేసింది. ఒకేరోజు ఈ రెండు సినిమాల(Two Movies) షూటింగ్స్ లో పాల్గొనడం త‌న‌కి ఎంతో ఆనందాన్ని ఇస్తున్న‌ట్టు పేర్కొంది. ఇక ఆ సినిమాల షూటింగ్ అప్‌డేట్ కూడా అందించింది. ఒక సినిమా షూటింగ్‌(Shooting) ఆంధ్రాలో, మరొకటి తెలంగాణలో జరుగుతుంది. ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి అని సోషల్ మీడియా(S0cial Media)లో రాసుకోచ్చింది నిధి. దాంతో ప్రభాస్, పవన్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

రెండు చిత్రాల్లో భాగం అవుతూ ఒకే రోజు రెండు సిటీల మధ్య ప్రయాణించడం నిధి అగ‌ర్వాల్‌కి ఛాలెంజ్‌గా మారింది. ఒకే రోజులో విజయవాడలో “హరి హర వీర మల్లుష‌ షూటింగ్‌లో పాల్గొని, ఆ వెంటనే హైదరాబాద్‌కు ప్రయాణించి “ది రాజా సాబ్” షూటింగ్‌కు హాజరవ్వాల్సి వచ్చింది. అంతే కాకుండా ఈ రెండు పాత్రల మధ్య వ్యత్యాసం కూడా ఉంది. రెండు పాత్ర‌ల‌కి నిధి అగ‌ర్వాల్ త‌ప్ప‌క న్యాయం చేసి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటుంద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.