Lankala Deepak Reddy| బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. 2023అసెంబ్లీ ఎన్నికల్లోనూ దీపక్ రెడ్డి బీజేపీ నుంచి ఈ నియోజకవర్గంలో పోటీ చేసి 25,866ఓట్లు సాధించారు. దీపక్ రెడ్డికే ఉప ఎన్నికల్లోనూ మరోసారి బీజేపీ అధిష్టానం అవకాశం కల్పించింది.
విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills Byelection)లో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి(BJP Lankala Deepak Reddy)ని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. 2023అసెంబ్లీ ఎన్నికల్లోనూ దీపక్ రెడ్డి బీజేపీ నుంచి ఈ నియోజకవర్గంలో పోటీ చేసి 25,866ఓట్లు సాధించారు. దీపక్ రెడ్డికే ఉప ఎన్నికల్లోనూ మరోసారి బీజేపీ అధిష్టానం అవకాశం కల్పించింది. బీజేపీ అభ్యర్థి ఖరారుతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల అభ్యర్థుల ప్రకటన పూర్తయ్యింది. దీంతో కాంగ్రెస్ నుంచి నవీన్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ సతీమణి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డిలు మధ్య త్రిముఖ పోటీకి తెరలేచింది.
అభ్యర్థులంతా నామినేషన్ల దాఖలు పక్రియలో బీజీగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,98,982మంది ఉండగా..ఇందులో 2లక్షల వరకు బీసీ ఓటర్లు, 96,500మంది వరకు ముస్లిం మైనార్టీ ఓటర్లు ఉండటం గమనార్హం. ఎస్సీలు 26వేలు, మున్నూరుకాపు 21,800, కమ్మ 17వేలు, యాదవులు 14వేలు, క్రిస్టియన్ మైనార్టీ ఓటర్లు 10వేల మంది ఉన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram