Monica Song | Coolie Movie | ఇంటర్నెట్ ను ఊపేస్తున్న పూజా హెగ్డే

విధాత : కొన్నాళ్లుగా వరుస ప్లాప్ సినిమాలతో వెనుబడిన హాట్ బ్యూటీ పూజా హెగ్డే(Pooja Hegde) ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ(Coolie) సినిమాలో స్పెషల్ సాంగ్ ‘మోనికా’లో(Monica) పూజాహెగ్డే డ్యాన్స్ తో అదరగొట్టేసింది. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో, మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో దూసుకుపోతోంది. రెడ్ డ్రెస్ లో హాట్ గా ఉన్న పూజ చేసిన డ్యాన్స్ మరో లెవల్ లో ఉందంటున్నారు అభిమానులు. రజనీకాంత్ అభిమానులతో పాటు పూజా అభిమానులను మోనికా సాంగ్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం అందించిన ఈ పాట, తనదైన మార్క్ బీట్స్‌తో ఆకట్టుకుంటోంది. రంగస్థలం(Rangasthalam) సినిమాలో జిగేలు రాణిగా స్పెషల్ సాంగ్ లో అదరగొట్టిన పూజ..ఎఫ్ 3 సినిమాలో(F3 Movie) లైఫ్ అంటే మినీమం ఇట్టా ఉండాలా అంటూ రెండో స్పెషల్ సాంగ్ తో అలరించిది. ఇప్పుడు కూలీ(Coolie) మూవీలో మోనికా(Monica) పాటలో అదిరే అందం..డ్యాన్స్ తో గ్లామర్ షోతో మెస్మరైజ్ చేస్తోంది. హీరోయిన్ రోల్స్ కంటే ఈ బుట్టబొమ్మకు ఐటెంసాంగ్స్ బాగా కుదురుతున్నాయంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. చెప్పుకొస్తున్నారు. ఆగస్టు 14న(August 14th) కూలీ సినిమా విడుదల కానుంది.