Pooja Hegde| పూజా హెగ్డే పెళ్లి వేళాయనే..ఆ యువ హీరోతో మూడు ముళ్లు వేయించుకునేందుకు సిద్ధం..!
Pooja Hegde| ఇటీవల కాలంలో అందాల భామలు సైలెంట్‌గా పెళ్లి పీటలు ఎక్కుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. రకుల్, తాప్సీ వంటి భామలు ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా పెళ్లి పీటలెక్కనుందని తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా ఈమె పెళ్లి గురించి అనేక ప్రచారాలు జరుగుతున్నా కూడా దానిపై క్లారిటీ రావడం లేదు. పూజా హెగ్డే ఒకప్పుడు స్టార్ హీరోయి

Pooja Hegde| ఇటీవల కాలంలో అందాల భామలు సైలెంట్‌గా పెళ్లి పీటలు ఎక్కుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. రకుల్, తాప్సీ వంటి భామలు ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా పెళ్లి పీటలెక్కనుందని తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా ఈమె పెళ్లి గురించి అనేక ప్రచారాలు జరుగుతున్నా కూడా దానిపై క్లారిటీ రావడం లేదు. పూజా హెగ్డే ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. మహేష్ బాబుతో మహర్షి, ప్రభాస్‌తో రాధే శ్యామ్, ఎన్టీఆర్ సరసన అరవింద సమేత, అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురం సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ఇటీవల వరుస ఫ్లాపులు పలకరించడంతో అవకాశాలు సన్నగిల్లాయి. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందట.
పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే బాలీవుడ్ సీరియల్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ రోహన్ మెహ్రాని పెళ్లి చేసుకోనుందని అంటున్నారు. పూజా హెగ్డే ఇటీవల బాయ్ ఫ్రెండ్ రోహన్ తో తరచుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. పలుమార్లు కెమెరాకు కూడా చిక్కింది. అతనితో కలిసి పార్టీలు, డిన్నర్ నైట్స్ ఎంజాయ్ చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఎక్కడికి వెళ్లిన పూజా పక్కన అతను తప్పక కనిపిస్తున్నాడు. .ఆ మధ్య పూజాగా హెగ్డే కారులో వెళ్తుండగా అందులో రోహన్ మెహ్రా కూడా దర్శనం ఇచ్చాడు. దీంతో ఈ జంట ప్రేమలో ఉన్నారని అందరు ఫిక్స్ అయ్యారు.
అయితే పూజా హెగ్డే పేరెంట్స్ కూడా వీరి ప్రేమ, పెళ్లిని యాక్సెప్ట్ చేశారట. దీంతో త్వరలో ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారని అందరు భావిస్తున్నారు.మరి దీనిపై పూజా హెగ్డే ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి. ఇక పూజా హెగ్డే పరిస్థితి తెలుగులో దారుణంగా మారింది. ఇక్కడ శ్రీలీలకు బాగా డిమాండ్ పెరగడంతో పూజా హెగ్డేను టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది. పైగా గురుజీ సైతం గుంటూరు కారం సినిమా నుంచి తప్పించడంతో.. పూజా హెగ్డేకు తెలుగులో సినిమా అవకాశాలు లేకుండా పోయాయి. రానున్న రోజులలో అయిన ఈ అమ్మడికి మంచి అవకాశాలు వస్తాయా లేదా అనేది చూడాలి.