Prabhas|సినిమాల విష‌యంలో త‌గ్గేదేలే అంటున్న ప్ర‌భాస్ .. ఎలా మేనేజ్ చేస్తున్నాడు..!

Prabhas|డార్లింగ్ ప్ర‌భాస్ సినిమాల విష‌యంలో స్పీడ్ త‌గ్గించ‌డం లేదు. ఒక దాని త‌ర్వాత మ‌రొక‌టి అన్న‌ట్టుగా ఉంది.ఏడు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు. రెండు కూడా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్‌. ప్రస్తుతం ప్రభాస్ ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ మాత్రమే కాదు.. చాలా బిజీ స్టార్ కూడా అయ్యాడు. రాజాసాబ్

  • By: sn    cinema    Nov 09, 2024 5:05 PM IST
Prabhas|సినిమాల విష‌యంలో త‌గ్గేదేలే అంటున్న ప్ర‌భాస్ .. ఎలా మేనేజ్ చేస్తున్నాడు..!

Prabhas|డార్లింగ్ ప్ర‌భాస్ సినిమాల విష‌యంలో స్పీడ్ త‌గ్గించ‌డం లేదు. ఒక దాని త‌ర్వాత మ‌రొక‌టి అన్న‌ట్టుగా ఉంది.ఏడు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు. రెండు కూడా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్‌. ప్రస్తుతం ప్రభాస్ ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ మాత్రమే కాదు.. చాలా బిజీ స్టార్ కూడా అయ్యాడు. రాజాసాబ్ , ఫౌజీ సినిమాలను దాదాపు వచ్చే ఏడాది రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.. ప్రస్తుతం ఆయన జెట్‌ వేగంతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్‌’, హను రాఘపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, మరోవైపు సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్‌’, ఇంకోవైపు ప్రశాంత్‌నీల్‌ ‘సలార్‌ 2’. ఇక నాగ్‌ అశ్విన్‌ ‘కల్కి 2’ ఇలాగూ ఉంది. వీటిలో కొన్ని షూటింగ్‌ దశలో ఉంటే.. కొన్ని ప్రీప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి.

ప్రభాస్ ప్రస్తుతం చేస్తోన్న ఐదు సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు కూడా 4 ఏళ్ళల్లోనే ఫినిష్ అవుతాయని తెలుస్తోంది. ఇలా ఫినిష్ చేయాలంటే గ్యాప్ లేకుండా ప‌ని చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఆ ప్రాజెక్ట్స్‌ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ స్పీడ్ చూస్తుంటే ఫినిష్ చేసేలానే కనిపిస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తయ్యేసరికి అతని మార్కెట్ వేల్యూ 1000 కోట్లు దాటిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. అలాగే రెమ్యునరేషన్ కూడా 300 కోట్లు దాటిపోతుందని చెబుతున్నారు.

సందీప్ వంగా కూడా త్వ‌ర‌లోనే స్పిరిట్ అనే మూవీని మొద‌లు పెట్ట‌బోతున్నాడు. ఓ వైపు రాజా సాబ్ , ఓ వైపు ఫౌజీ , మరో వైపు స్పిరిట్ . ఈ మూడు సినిమాలకు డిఫరెంట్ లుక్స్ మైంటైన్ చేయాల్సి ఉంటుంది. మరి ఒకేసారి మూడు సినిమాలను ప్రభాస్ ఎలా మ్యానేజ్ చేయగలడు అనే ఆలోచ‌న అంద‌రిలో ఉంది. బహుశా ముందు వేరే నటి నటులతో షూటింగ్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత ప్రభాస్ తో షూట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ న్యూస్ విన్న డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. స్పిరిట్ కంప్లీట్ అయితే వెంటనే సలార్-2, కల్కి-2 చిత్రాలు వెయిటింగ్ లో ఉన్నాయి. మొత్తానికి ఇది ప్రభాస్ కు మాత్రమే సాధ్యం అనిపించుకుంటున్నాడు.