Prabhas| ఊరించి ఉసూరుమ‌నిపించిన ప్ర‌భాస్.. పెళ్లి వార్త చెబుతాడ‌నుకుంటే..!

Prabhas| యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఆయ‌న కెరీర్ విష‌యంలో చూపిస్తున్న శ్ర‌ద్ధ పెళ్ళిపై చూపించడం లేదు. 44 ఏళ్ళు వ‌చ్చిన ఇంకా పెళ్లి గురించి ఆలోచించ‌డం లేదు. ఎంత మంది పెళ్లి గురించి ప్ర‌శ్నించిన టైమ్ వ‌చ్చిన‌ప్పుడు చూద్దాం

  • By: sn    cinema    May 18, 2024 7:16 AM IST
Prabhas| ఊరించి ఉసూరుమ‌నిపించిన ప్ర‌భాస్.. పెళ్లి వార్త చెబుతాడ‌నుకుంటే..!

Prabhas| యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఆయ‌న కెరీర్ విష‌యంలో చూపిస్తున్న శ్ర‌ద్ధ పెళ్ళిపై చూపించడం లేదు. 44 ఏళ్ళు వ‌చ్చిన ఇంకా పెళ్లి గురించి ఆలోచించ‌డం లేదు. ఎంత మంది పెళ్లి గురించి ప్ర‌శ్నించిన టైమ్ వ‌చ్చిన‌ప్పుడు చూద్దాంలే అని అంటున్నాడు త‌ప్ప క్లారిటీ ఇవ్వ‌డం లేదు. అయితే మే17 ఉదయం ప్ర‌భాస్ ఇన్‌స్టా స్టోరీ పోస్ట్ చేశాడు. అందులో త్వరలోనే మన జీవితంలోకి ఓ ప్రత్యేకమైన వాళ్లు వస్తున్నారు.. వెయిట్ చేయండి అని రాసుకొచ్చాడు. దీంతో అంద‌రు ప్ర‌భాస్ త‌న పెళ్లి గురించి ప్ర‌క‌టించ‌బోతున్నాడా ఏంట‌ని ఆశ‌గా ఎదురు చూశారు. కాని తీరా చూస్తే అది కల్కి 2898 ఏడీ మూవీ ప్రమోషన్ల కోసమే అని త తేలింది.

త‌న ఇన్‌స్టా స్టోరీలో మ‌రో పోస్ట్ చేసిన ప్ర‌భాస్.. మన జీవితాల్లోకి రాబోతున్న ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఈ బుజ్జి అనే కారే అంటూ తేల్చి చెప్పాడు. కల్కి మూవీలో ప్రభాస్ పాత్ర పేరు భైరవ కాగా, ఆయన ఓ ప్రత్యేక వాహనం వాడుతారట. దాని పేరు బుజ్జి . దీనిని మే 18 సాయంత్రం 5:00 గంటలకు ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు. ఈ కారు ఎలా ఉంటుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. క‌ల్కి చిత్రంతో నాగ్ అశ్విన్ ప్రేక్ష‌కుల‌ని ఫ్యూచర్ లోకి తీసుకెళ్లనున్నారు. ఈ చిత్రంలో వాహనాలని కూడా భవిష్యత్ పరిస్థితులను ఊహించి డిజైన్ చేసిన‌ట్టు తెలుస్తుంది.

ఇక కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న రిలీజ్ కానుండ‌గా,ఈ సినిమా కోసం 600 కోట్ల బ‌డ్జెట్ కేటాయించారు. మూవీ రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టారు. దేశ వ్యాప్తంగా మూవీని విస్తృతంగా ప్ర‌చారం చేయ‌బోతున్నారు. మ‌హాన‌టి త‌ర్వాత నాగ్ అశ్విన్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇదే కాగా, దీనిపై అందరిలో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ తోపాటు దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలాంటి వాళ్లు నటిస్తున్నారు. భారీ కాస్టింగ్‌తో ఈ మూవీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా వైజయంతి మూవీస్ బేన‌ర్‌పై అశ్వినీద‌త్ నిర్మించారు.