Venezuela Plane Crash : టేకాఫ్ కాగానే కూలిపోయిన విమానం
వెనిజులాలోని టాబిరా పరమిల్లో ఎయిర్‌పోర్టులో ఎయిర్‌క్రాఫ్ట్ టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలి, మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. టైరు పేలడం వల్లే పైలట్ నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని తెలుస్తోంది. విమానయాన శాఖ దర్యాప్తు చేస్తోంది.

న్యూఢిల్లీ : ఇటీవల విమాన ప్రమాదాలు అన్ని దేశాల్లోని పెరిగిపోతున్నాయి. కారణాలు ఏమైనా విమాన ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా వెనిజులాలోని టాబిరాలోని పరమిల్లో ఎయిర్‌పోర్టులో ఎయిర్‌క్రాఫ్ట్ టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గాలిలోకి ఎగిరి విమానం క్షణాల్లోనే ఎడమవైపు ఒరిగి, తలకిందులుగా కూలిపోయి మంటల్లో కాలిపోయింది.
ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. టైర్ పేలడం వల్లే పైలట్ నియంత్రణ కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వెనిజులా విమానయాన శాఖ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతుంది.
Venezuela: Two dead after small plane crashes on take-off from Paramillo Airport, Táchira.
Investigation underway.pic.twitter.com/KJFQLNcBrE
— Volcaholic 🌋 (@volcaholic1) October 22, 2025