Rashmi Gautam|జీవితంలో పెళ్లే చేసుకోను అన్న రష్మీ గౌతమ్.. ఆ యాంకర్‌కి ముద్దు పెడతానంటూ స్టన్నింగ్ కామెంట్
Rashmi Gautam| యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందం, ఆకట్టుకునే మాటలతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.ముందుగా నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రష్మీ ఆ తర్వాత బుల్లితెర దగ్గర జబర్దస్త్ ప్రోగ్రాంతో బాగా పాపులర్ అయింది. అలాగే తర్వాత నుంచి

Rashmi Gautam| యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందం, ఆకట్టుకునే మాటలతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.ముందుగా నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రష్మీ ఆ తర్వాత బుల్లితెర దగ్గర జబర్దస్త్ ప్రోగ్రాంతో బాగా పాపులర్ అయింది. అలాగే తర్వాత నుంచి ఆమెకి మంచి ఫేమ్ రావడం ఇదే జబర్దస్త్ నుంచి పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ తో షోస్ చేయడం రష్మీకి మరింత పేరు తెచ్చింది. జబర్దస్త్ తెచ్చిపెట్టిన ఫేమ్ హీరోయిన్ కావాలన్న రష్మీ గౌతమ్ కల నెరవేర్చింది. జయాపజయాలతో సంబంధం లేకుండా పదికి పైగా చిత్రాల్లో రష్మీ గౌతమ్ హీరోయిన్ గా నటించింది. ప్రారంభంలో ఆమె కేవలం సపోర్టింగ్ రోల్స్ చేసింది.
సుధీర్, రష్మీల కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ఒకటి రెండు సందర్భాల్లో వీరికి ఉత్తుత్తి పెళ్లి చేశారు. సాంగ్స్, స్కిట్స్ లో నాన్ స్టాప్ రొమాన్స్ పండిస్తూ ఆశ్చర్యపరిచారు. సుధీర్-రష్మీ నిజమైన ప్రేమికులు అని నమ్మేవారు లేకపోలేదు. సుధీర్ తో మీ పెళ్లి ఎప్పుడని రష్మీ గౌతమ్ ని తరచుగా అడుగుతూ ఉంటారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మీ గౌతమ్ స్టన్నింగ్ కామెంట్స్ చేసింది.. ఓ అభిమాని… చెంపదెబ్బ, వార్నింగ్, ముద్దు… ఇవ్వాల్సి వస్తే హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్ లలో ఎవరికి ఏమిస్తావని అంటూ అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా… హైపర్ ఆదికి చెంప దెబ్బ ఇస్తాను. ఎందుకంటే టీజ్ చేస్తూ ఉంటాడని చెప్పింది.
సుడిగాలి సుధీర్ కి వార్నింగ్ ఇస్తానని, ముద్దు మాత్రం యాంకర్ ప్రదీప్ కి ఇస్తుందని పేర్కొంది. సుడిగాలి సుధీర్ కి షాక్ ఇస్తూ ప్రదీప్ కి ముద్దు ఇస్తానన్న రష్మీ… సుధీర్ కి మాత్రం వార్నింగ్ ఇస్తాననడంతో అందరు షాక్ అవుతున్నారు. ఇక 36 ఏళ్ల రష్మీ గౌతమ్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎప్పుడు వివాహం చేసుకుంటారు, ఎలాంటి భర్త రావాలని అడిగితే అసలు తనకి పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు.. సో ఎలాంటి భర్త రావాలని నేను కోరుకోవడం లేదు అంటూ తన పెళ్లిపై ఓ క్లారిటీ ఇచ్చింది. రష్మీ ఇప్పుడు జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో యాంకర్ గా కొనసాగుతుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ రద్దు చేసిన మేకర్స్… వారంలో రెండు ఎపిసోడ్స్ జబర్దస్త్ పేరిట ప్రసారం చేస్తున్నారు. వాటికి రష్మీనే యాంకర్‌గా ఉంది.