Bigg Boss|గుప్పెడంత మనసు సీరియల్‌కి శుభం కార్డ్.. రిషి,వసుధారలని బిగ్‌బాస్‌లోకి పంపబోతున్నారా..!
Bigg Boss| తెలుగు రాష్ట్ర ప్రజలకి గుప్పెడంత మనసు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్ కొన్ని రోజులుగా ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ వస్తుంది. ఇందులో రిషి, వసుధార పాత్రలు అందరికి బాగా కనెక్ట్ అయ్యాయి. గుప్పెడంత మనసు సీరియల్ చూడకుండా ఉండలేనివారు ఎందరో ఉన్నారు. ఇక మరి కొద్ది రోజులలోనే ఈ సీరియల్ కు శుభం కార్డ్ వేయబోతున్నారని తెలిసి చాలా మంది బాధలో మునిగిపోయారు.

Bigg Boss| తెలుగు రాష్ట్ర ప్రజలకి గుప్పెడంత మనసు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్ కొన్ని రోజులుగా ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ వస్తుంది. ఇందులో రిషి, వసుధార పాత్రలు అందరికి బాగా కనెక్ట్ అయ్యాయి. గుప్పెడంత మనసు సీరియల్ చూడకుండా ఉండలేనివారు ఎందరో ఉన్నారు. ఇక మరి కొద్ది రోజులలోనే ఈ సీరియల్ కు శుభం కార్డ్ వేయబోతున్నారని తెలిసి చాలా మంది బాధలో మునిగిపోయారు. అయితే జగతీ అలియాస్ జ్యోతీరాయ్ఈ సీరియల్‌లో రిషి తల్లిగా నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆమె సీరియల్ నుండి ఎప్పుడైతే తప్పుకుందో అప్పటి నుండి ఈ సీరియల్ కు రేటింగ్ చాలా వరకు తగ్గింది.
మరోవైపు రిషి కూడా సినిమా షూటింగ్ వలన కూడా సీరియల్‌కి దూరమయ్యాడు. అయితే రిషీ అయితే ఎంట్రీ ఇచ్చాడు కాని మరి కొద్ది రోజులలో ఈ సీరియల్‌కి శుభం కార్డ్ వేయనున్నారని అంటున్నారు. ఈ సీరియల్ కుశుభం కార్డ్ వేయడానికి ఓ పెద్ద కారణమే ఉందని అంటున్నారు. సీరియల్ ద్వారా బాగా ఫేమస్అయిన రిషి - వసుధారలను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే ఇలా సడెన్‌గా గుప్పెడంత మనసు సీరియల్‌కి శుభం కార్డ్ వేస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. సీరియల్లో రిషి పాత్రలో నటించిన ముఖేష్ గౌడ, వసుధార పాత్రలో నటించిన రక్షిత గౌడ ఇద్దరూ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇస్తే షో రక్తి కట్టే అవకాశం ఉంది కాబట్టి వారిని బిగ్ బాస్ హౌజ్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.
రిషి, వసుధార కన్నడ ఇండస్ట్రీకి చెందిన వీరు.. తెలుగులోనే బాగా పాపులర్ అయ్యారు. అయితే ఈ ఇద్దరు తెలుగు బిగ్ బాస్ షోలోకి వెళుతున్నారు అంటే పొరపాటు పడ్డట్టే. కన్నడ బిగ్ బాస్ రియాల్టీ షోలోకి రిషి అలియాస్ ముఖేష్ గౌడ వెళ్తుండగా.. తెలుగు బిగ్ బాస్ షోలోకి వసుధార అలియాస్ రక్షిత గౌడ కంటెస్టెంట్ గా వెళ్తుందని టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రాలేదు కాని ఈ వార్త మాత్రం సోషల్ మీడియా లో కోడై కూస్తోంది. కాని ఈ ఇద్దరు తారలకు కన్నడలో కంటే.. తెలుగులోనే పాపులారిటీ ఎక్కువగా ఉంది. రిషిని కూడా తెలుగు బిగ్ బాస్ లోకి తీసుకొస్తే బాగుంటుందని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.