Salman Khan| ఎట్ట‌కేల‌కి బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌ల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ‌.. ఎవ‌రి కోసం రాసాడంటే.!

Salman Khan| బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న స‌ల్మాన్ ఇక పెళ్లి చేసుకునేలా క‌నిపించ‌డం లేదు. 58 ఏళ్లు వచ్చిన కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా స్టిల్ బ్యాచిల‌ర్‌గానే ఉన్నాడు. అయితే స‌ల్మాన్ ఖా

  • By: sn    cinema    May 09, 2024 7:49 AM IST
Salman Khan| ఎట్ట‌కేల‌కి బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌ల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ‌.. ఎవ‌రి కోసం రాసాడంటే.!

Salman Khan| బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న స‌ల్మాన్ ఇక పెళ్లి చేసుకునేలా క‌నిపించ‌డం లేదు. 58 ఏళ్లు వచ్చిన కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా స్టిల్ బ్యాచిల‌ర్‌గానే ఉన్నాడు. అయితే స‌ల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోక‌పోయిన చాలా మంది హీరోయిన్స్‌తో ఎఫైర్ న‌డిపినట్టు ప్ర‌చారాలు సాగాయి. స్టార్ హీరోయిన్లు.. అప్సరసల్లాంటి ఎంతో మంది క‌థానాయిక‌ల‌తో స‌ల్మాన్ న‌టించిన కూడా అందులో ఎవ‌రిని పెళ్లి చేసుకోలేదు స‌ల్మాన్. ఎందుకు ఇలా బ్యాచిల‌ర్‌గా ఉన్నాడ‌నేది ఎవ‌రికి అర్ధ కావ‌డం లేదు. అయితే స‌ల్మాన్ పెళ్లి చేసుకోలేదు స‌రే, క‌నీసం ప్రేమాయ‌ణం న‌డిపాడా అంటే అవుననే స‌మాధానం వినిపిస్తుంది.

స‌ల్మాన్ రాసిన ఓ ప్రేమ‌లేఖ ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.మ‌న‌సు పెట్టి రాసిన లేఖ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, ఇది ఎవ‌రికి రాసారు అని తెలుసుకోవాల‌ని అభిమానులు చాలా ఆస‌క్తితో ఉన్నారు . 34 ఏళ్ల క్రితం సల్మాన్ ఖాన్ తనకు అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళ కోసం ప్రేమ లేఖ రాసారు. 1989లో స‌ల్మాన్ రాసిన లేఖ‌లో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నన్ను ప్రేమిస్తావని ఆశిస్తున్నాను అని ఉంది. ఇలా ఎవ‌రికి రాసారా అని ఆరాలు తీస్తే అది త‌న అభిమానుల కోసం రాసాడ‌ట‌. కాస్త వెరైటీగా ఉంటుంద‌ని అలా రాసుకొచ్చాడ‌ట‌. మైనే ప్యార్ కియా భారీ విజయాన్ని అందుకోవడం, సల్మాన్ క్రేజ్ విప‌రీతంగా పెరిగిపోవ‌డంతో అప్పుడు లేఖ రాసి విడుద‌ల చేశాడు.

29 డిసెంబర్ 1989 న చిత్రం విడుద‌ల కాగా, ఈ మూవీ రిలీజైన నాలుగు నెలల తర్వాత ఏప్రిల్ 1990లో స‌ల్మాన్ ఈ లేఖ రాసారు. ఇందులో నన్ను అంగీకరించినందుకు, నన్ను ప్రేమిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నాకు మర్చిపోలేని విజయాన్ని అందించారు. ఇక నుండి మంచి సినిమాలే చేస్తాను. మైనే ప్యార్ కియాని మించి సినిమాలు మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తార‌ని, అలాంటి సినిమాలు మీ ముందుకు తీసుకొచ్చేందుకు వంద శాతం ప్ర‌య‌త్నిస్తాను అని స‌ల్మాన్ త‌న లేఖ‌లో రాసారు. ప్ర‌స్తుతం ఈ లేఖ నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది.