Hidden Camera In Rented House | అద్దె ఇంట్లో సీక్రెట్ కెమెరాలు..ఇంటి యజమాని నిర్వాకం

హైదరాబాద్ జవహర్ నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో బాత్‌రూమ్‌ బల్బ్ హోల్డర్‌లో ఇంటి యజమాని సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేయటం కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు యజమాని అశోక్‌ను అరెస్టు చేశారు.

Hidden Camera In Rented House | అద్దె ఇంట్లో సీక్రెట్ కెమెరాలు..ఇంటి యజమాని నిర్వాకం

విధాత: అద్దె ఇల్లు తీసుకునే వారు అప్రత్తమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పే ఘటన వైరల్ గా మారింది. హైదరాబాద్
మధురానగర్ పరిధిలోని జవహర్ నగర్ లో అద్దె ఇంట్లో సీక్రేట్ కెమెరాల వ్యవహారం బయటపడటం కలకలం రేపింది. ఇంటి యజమాని అద్దె ఇంట్లోని బాత్‌రూమ్‌లో సీక్రేట్ కెమెరాలు ఏర్పాటు చేసిన నిర్వాకం ఆలస్యంగా వెలుగు చూసింది. బాత్ రూమ్ లో బల్బు పని చేయడం లేదని అద్దెకు ఉండే దంపతులు ఇంటి ఓనర్ ఆశోక్ కు తెలిపారు. బల్బు ఏర్పాటు చేయిస్తామని చెప్పి…ఎలక్ట్రిషియన్ చింటూతో కలిసి ఇంటి యజమాని అశోక్ బాత్ రూమ్ బల్బు హోల్డర్ లో సీసీ కెమెరా ఏర్పాటు చేయించాడు. ఈ నెల 4న బల్బ్ హోల్డర్‌లో కెమెరా అమర్చగా, అద్దెకు ఉంటున్న దంపతులు సీక్రెట్ కెమెరాను ఈ నెల 13న గుర్తించి ఓనర్ కు చెప్పారు.

ముందు బల్బ్ మార్పించిన ఓనర్ఈ విషయంపై బయటకి తెలిస్తే ఎలక్ట్రిషియన్ చింటూ పగబడ్తాడాని.. అతను ఎప్పుడు దాడి చేస్తాడో తెలియదని ఆ జంటను బెదిరించాడు. ఎవరికీ చెప్పకపోతే సేఫ్ గా ఉంటారని భయపెట్టాడు.. దీంతో బాధిత దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యజమాని అశోక్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఎలక్ట్రిషియన్ చింటూ పరారీలో ఉన్నాడు. ఈ సంఘటన జంటనగరాల్లో అద్దె ఇళ్లలో భద్రతను మరోసారి ప్రశ్నార్ధకం చేసింది.