Salman Khan| బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలతో స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ కి 58 ఏళ్లు వచ్చిన ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. పెళ్లి గురించి మీడియా పలు సందర్భాలలో ప్రశ్నించగా, ఆయన ఏదో సమాధానం చెబుతున్నాడు. అయితే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా కాలం వెల్లదీస్తున్న సల్మాన్ ఖాన్ ఎందుకు పెళ్లంటే ఆమడదూరం వెళుతున్నాడు,
Salman Khan| బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలతో స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ కి 58 ఏళ్లు వచ్చిన ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. పెళ్లి గురించి మీడియా పలు సందర్భాలలో ప్రశ్నించగా, ఆయన ఏదో సమాధానం చెబుతున్నాడు. అయితే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా కాలం వెల్లదీస్తున్న సల్మాన్ ఖాన్ ఎందుకు పెళ్లంటే ఆమడదూరం వెళుతున్నాడు, ఇంక జీవితంలో పెళ్లి చేసుకోడా అనే అనుమానాలు అందరి మదిలో తలెత్తుతున్నాయి. దీనిపై సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ చెప్పిన సమాధానం నెట్టింట వైరల్ అవుతుంది. గతంలో సల్మాన్ ఖాన్ పెళ్లిపై అతని తండ్రి ఓ సందర్భంలో స్పందించగా, ఆ పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
సల్మాన్ ఖాన్‌కి వచ్చే అమ్మాయి తన తల్లిలాగా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కాని ఈ రోజుల్లో అలా ఎవరు ఉన్నారు. అతను పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చేయడు. పెళ్లి చేసుకుంటే వచ్చే అమ్మాయి ఇంటిని చూసుకుంటుందో లేదో అన్న భయం అతనికి ఉంది. తన తల్లిలాగే ఏ అమ్మాయి అయినా తన భర్తకి, కుటుంబానికి పూర్తిగా అంకితమవ్వాలని అనుకుంటాడు. పిల్లల కోసం వంట వండాలి.. వాళ్లను రెడీ చేయాలి.. హోంవర్క్ చేయించాలి అనుకుంటాడు. కానీ ఈ కాలంలో అలా దొరకడం కష్టం అని సలీమ్ స్పష్టం చేశారు. అయితే సలీమ్ కామెంట్స్‌కి నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. సంగీతా బిజ్లానీ, ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్ లాంటి ఎంతో మందితో డేటింగ్ చేసాడు సల్మాన్. ఇంక అతనికి పెళ్లి ఎందుకులే అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఇక ఈ వయస్సులోను కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు సల్లూభాయ్ . ఇప్పుడు సికిందర్ అనే చిత్రం చేస్తుండగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా ఈ మూవీని నిర్మిస్తున్నారు. తొలి షెడ్యూల్లో భాగంగా మెహబూబ్ స్టూడియోస్‌లో ఏరియల్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనుండగా.. సల్మాన్ ఖాన్ అండ్ టీం ఈ షూట్లో పాల్గొననున్నారు.ఈ చిత్రాన్ని 2025 ఈద్ కానుకగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు