Shakeela| అందుకోస‌మే న‌న్ను బిగ్ బాస్‌లోకి తీసుకున్నారు.. అవ‌స‌రం తీరాక పంపారంటూ ష‌కీలా కామెంట్స్

Shakeela| షకీలా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు స్టార్ హీరోల‌కి ధీటుగా త‌న సినిమాల‌తో అల‌రించేది ష‌కీలా. ముఖ్యంగా బీ గ్రేడ్ సినిమాలో నటించి పాపులారిటీ సొంతం చేసుకున్నారు షకీలా. ప‌లు భాష‌ల‌లో న‌టించి మెప్పించిన ష‌కీలా ఇప్పుడు సినిమాల‌కి దూరంగా ఉంటూ ఇంట‌ర్వ్యూల‌తో వార్త‌

  • By: sn    cinema    Jul 05, 2024 6:29 PM IST
Shakeela| అందుకోస‌మే న‌న్ను బిగ్ బాస్‌లోకి తీసుకున్నారు.. అవ‌స‌రం తీరాక పంపారంటూ ష‌కీలా కామెంట్స్

Shakeela| షకీలా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు స్టార్ హీరోల‌కి ధీటుగా త‌న సినిమాల‌తో అల‌రించేది ష‌కీలా. ముఖ్యంగా బీ గ్రేడ్ సినిమాలో నటించి పాపులారిటీ సొంతం చేసుకున్నారు షకీలా. ప‌లు భాష‌ల‌లో న‌టించి మెప్పించిన ష‌కీలా ఇప్పుడు సినిమాల‌కి దూరంగా ఉంటూ ఇంట‌ర్వ్యూల‌తో వార్త‌ల‌లో నిలుస్తుంది. ఆ మ‌ధ్య నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 7లో షకీలా పాల్గొన్నారు. కొన్నివారాలకే ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు రాగా, ఆ షో గురించి సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. ఇక తాజాగా షోతో పాటు అందులోని హౌజ్‌మేట్స్ గురించి కూడా కామెంట్స్ చేసింది.

బిగ్ బాస్ 7 లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. శివాజీ, అమర్ దీప్, రతిక, ప్రియాంక, శోభా శెట్టి, అర్జున్, షకీలా, టేస్టీ తేజ లాంటి వారు త‌మ ఆట‌తీరుతో ఆక‌ట్టుకున్నారు. అయితే ష‌కీలా కూడా సీజ‌న్ 7లో పాల్గొన‌గా, ఆమె టాప్ 5 వ‌ర‌కు ఉంటార‌ని అంద‌రు అనుకున్నారు. కానొ ఊహించ‌ని విధంగా ఎప్పుడో ఎలిమినేట్ అయింది.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో షకీలా మాట్లాడుతూ తన ఎలిమినేషన్ గురించి మాట్లాడుతూనే పల్లవి ప్రశాంత్, శివాజీ, నాగార్జున గురించి కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. హౌజ్‌లో నాకు సందీప్, అమర్ దీప్, దామిని, ప్రియాంక కాస్త నిజాయితీ ప‌రులుగా కనిపించారు. వాళ్ల క‌ళ్ల‌లో నాకు నిజాయితీ క‌నిపించింది.

శివాజి న్యూట్ర‌ల్ ప‌ర్స‌న్‌. అత‌ను నిజాయితీ ప‌రుడా కాదా అనేది నేను చెప్పను కాని, వీక్ గా అనిపించిన కంటెస్టెంట్స్ కి మాత్రం తన సాయం అందిస్తాడు. ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ మాత్రం బిగినింగ్‌లో పిల్లిలా ఉన్నాడు. విన‌యం ప్ర‌ద‌ర్శించాడు. కాస్త పాపులారిటీ ద‌క్క‌గానే సీనియర్ ఆర్టిస్టులు ముందున్నా కూడా లెక్క‌చేయ‌లేదు. పూర్తిగా యాటిట్యూడ్ మారింది. సీనియ‌ర్ ఆర్టిస్ట్స్ ముందున్నా పట్టించుకోలేదు. కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటూ యాటిట్యూడ్ ప్రదర్శించాడు. అది నాకు నచ్చలేదు . ఇది విన్న ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ అభిమానులు ఏం చేసిన పర్వాలేదు. ఐ డోంట్ కేర్ అంటూ ష‌కీలా పేర్కొంది. ఇక తనని మాత్రం బిగ్ బాస్ లోకి కేవలం పబ్లిసిటీ కోసమే తీసుకున్నారు, వాళ్ళ అవసరం తీరిపోయాక నన్ను బ‌య‌ట‌కు పంపించేశారు.. బిగ్ బాస్ వల్ల నాగార్జున గారికి తప్ప ఎవ‌రికి ఉప‌యోగం లేదు. ఎందుకంటే స్టూడియో ఆయనదే, హోస్ట్ ఆయనే.. కాబట్టి ఆయనకి మాత్రమే లాభం అంటూ ష‌కీలా సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్ర‌స్తుతం ఆమె చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.