Sunil|చిరంజీవి రాజ‌కీయాల‌లో స‌క్సెస్ కాక‌పోవ‌డానికి కార‌ణం చెప్పిన క‌మెడీయ‌న్ సునీల్

Sunil| టాలీవుడ్ పాపులర్ క‌మెడీయ‌న్ సునీల్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న చిరంజీవిని స్పూర్తిగా తీసుకొని ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు.త‌న‌

  • By: sn    cinema    May 03, 2024 11:03 AM IST
Sunil|చిరంజీవి రాజ‌కీయాల‌లో స‌క్సెస్ కాక‌పోవ‌డానికి కార‌ణం చెప్పిన క‌మెడీయ‌న్ సునీల్

Sunil| టాలీవుడ్ పాపులర్ క‌మెడీయ‌న్ సునీల్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న చిరంజీవిని స్పూర్తిగా తీసుకొని ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు.త‌న‌దైన శైలిలో అద్భ‌త‌మైన డ్యాన్స్‌తో అల‌రిస్తుంటారు. ఇక కామెడీతో ,ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంత‌గా న‌వ్విస్తుంటారో మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఆయ‌న చిరంజీవి గురించి ఇటీవ‌ల చేసిన కామెంట్స్ నెట్టింట తెగ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల‌లో పొలిటిక‌ల్ హీట్ ఓ రేంజ్‌లో ఉంది. ఈ క్ర‌మంలో సునీల్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. చిరంజీవి త్వ‌ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం పిఠాపురం వెళ్ల‌నున్నార‌ని, అక్క‌డ త‌న త‌మ్ముడి కోసం ప్రచారం చేస్తార‌ని టాక్స్ వినిపిస్తున్నాయి.

ఈ తరుణంలో చిరంజీవి రాజకీయ ప్రస్థానం గురించి సునీల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నేను చిత్ర పరిశ్రమ కి వచ్చింది చిరంజీవి గారి వల్లే. ఆయన్ని ఆదర్శంగా తీసుకునే సినిమా ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డ్డాను. అన్న‌య్య నాకు చాలా సాయం చేశారు. ఆయ‌న చేసిన సాయం నేను ఎవ‌రికి చేయ‌లేనేమో. చాలా ఓపిక ఉన్న వ్య‌క్తి. చిరంజీవి గారిని చాలా మంది రాజ‌కీయంగా స‌క్సెస్ కాలేదు అని అంటారు. అవును అక్క‌డ స‌క్సెస్ కాలేక‌పోయారు, కాని వ‌ర్క్ విష‌యంలో, సినిమా రంగంలో చిరంజీవి గారే ఎప్ప‌టికీ టాప్. సొంత టాలెంట్‌తో ఈ స్థాయికి చేరుకోవ‌డం అంటే మాములు విష‌యం కాదు. పొలిటికల్ గా సక్సెస్ కావాలంటే చాలా అంశాలు, చాలా మంది వ్యక్తుల పై ఆధారపడి ఉంటుంది. కాని సినిమాల్లో మాత్రం ఆయన సొంత ట్యాలెంట్ తో ఎదిగారు.

రాజ‌కీయాల‌లో ఆయ‌న చుట్టూ ఉన్న వ్య‌క్తుల‌లో ఒక్క‌రు రాంగ్ స్టెప్ వేసిన కూడా కొలాప్స్. అందుకే చిరంజీవి చుట్టూ ఉన్న కొంద‌రి వ‌ల‌న, వారు తీసుకున్న త‌ప్పుడు నిర్ణ‌యాల వ‌ల‌న చిరంజీవి ఇబ్బంది ప‌డాల్సి వ‌చ్చింద‌ని సునీల్ అన్నారు. ఇప్పుడు ఆయ‌న మాట‌లు ఏపీ రాజ‌కీయాల‌లో కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి ఆ మ‌ధ్య తాను ఇక రాజ‌కీయాల జోలికి వెళ్ల‌న‌ని కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం తాను సినిమాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు.