Ananya Nagalla | ట్రోలర్స్ బారినపడ్డ తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ల.. ఇంతకు ఏం జరిగిందంటే..?
Ananya Nagalla | ఇటీవలకాలంలో ట్రోల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎవరూ తమ వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించినా కొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్‌కు దిగుతున్నారు. సినిమా తారలు, రాజకీయ నాయకుల విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటున్నది. వ్యక్తిగత జీవితంతో పాటు పర్సనల్ లైఫ్‌పై ట్రోటింగ్‌కు దిగుతున్నారు.

Ananya Nagalla | ఇటీవలకాలంలో ట్రోల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎవరూ తమ వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించినా కొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్‌కు దిగుతున్నారు. సినిమా తారలు, రాజకీయ నాయకుల విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటున్నది. వ్యక్తిగత జీవితంతో పాటు పర్సనల్ లైఫ్‌పై ట్రోటింగ్‌కు దిగుతున్నారు. వారు చేసిన వ్యాఖ్యల్లో మంచి ఉందా? ఏమైనా తప్పుడు వ్యాఖ్యలు చేశారా? అన్న విచక్షణ లేకుండా ట్రోలింగ్‌కు దిగుతున్నారు. ఈ క్రమలో సోషల్ మీడియాలో ఏదైనా అంశంపై తమ అభిప్రాయం చెప్పాలనుకునుకుంటున్న వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పుడిదంతా ఎందుకనుకుంటున్నారా..? టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల సైతం ట్రోలర్స్ బారినపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మల్లేశం మూవీతో సినిమారంగ ప్రవేశం చేసింది. వకీల్ సాబ్ మూవీ ఈ అమ్మడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇటీవల తంత్ర మూవీలో నటించింది. ఇటీవల ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా ‘ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి’ అంటూ పోస్ట్ చేసింది. ప్లాస్టిక్ స్ట్రాలకు బదులుగా స్టీల్ స్ట్రాలను వినియోగించాలని సూచించింది. దాంతో నటిని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. నువ్వు ప్లాస్టిక్ వాడడం లేదా? నువ్వు చెప్పేదాంట్లో పాజిబులిటీ ఉందా? అంటూ పలువురు కామెంట్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై అనన్య గట్టి కౌంటర్ ఇచ్చింది. తన వ్యాఖ్యలను కొందరు తప్పుదోవ పట్టించారని పేర్కొంది.
తాను చెప్పినదాంట్లో నచ్చితే పాటించాలని.. లేకపోతే వదిలేయాలని చెప్పింది. ప్రతీదానికి ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించింది. ఇదిలా ఉండగా.. అనన్య చివరిసారిగా ‘డార్లింగ్’ మూవీలో నటించింది. ప్రస్తుతం పొట్టేల్ మూవీలో నటిస్తున్నది. ఈ మూవీలో ఈ నెలలో విడుదల కానున్నది. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ బ్యానర్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించగా.. సాహిత్ మోతుకూరి దర్శకత్వం వహించారు. యువ చంద్ర కృష్ణ, అజయ్, జీవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూటీ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఓ మారుమూల గ్రామంలో ఓ కుటుంబాన్ని కుల వివక్షతో ఆ గ్రామస్తులు వెలివేయం, ఊరికి చెందిన పవిత్రమైన పొట్టెలు తప్పివడంతో ఊరు ప్రజలంతా ఒక్కటై ఆ కుటుంబంపై దాడి చేస్తుండం తదితర అంశాలపై టీజర్ విడుదలైంది.