Venu| ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఎవరికి అంత ఈజీగా రాదు. దానికి వెనక ఎన్నో అవమనాలు, కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. అయితే కొందరికి సక్సెస్ అనేది ఎర్లీగా వస్తే మరి కొందరికి మాత్రం చాలా సమయం పడుతుంది. అయితే జబర్ధస్త్ కమెడీయన్‌గా కెరీర్ ప్రారంభించిన వేణు ఎంతో మంది ప్రేక్షకుల
Venu| ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఎవరికి అంత ఈజీగా రాదు. దానికి వెనక ఎన్నో అవమనాలు, కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. అయితే కొందరికి సక్సెస్ అనేది ఎర్లీగా వస్తే మరి కొందరికి మాత్రం చాలా సమయం పడుతుంది. అయితే జబర్ధస్త్ కమెడీయన్‌గా కెరీర్ ప్రారంభించిన వేణు ఎంతో మంది ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఆ మధ్య మంచి మంచి సినిమాలతో మెప్పించిన అతనికి ఇప్పుడు నటుడిగా అవకాశలు కరువయ్యాయి. దాంతో దర్శకుడి అవతారం ఎత్తాడు. పల్లెటూరి వాతావరణంలో ఉండే భావోద్వేగాలతో బలగం అనే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయింది. మూవీకి సినీ రాజకీయ ప్రముఖుల నుంచి డైరెక్టర్ వేణుకి ప్రశంసలు దక్కాయి.
తొలి సినిమానే అంత అందంగా తెరకెక్కించిన వేణుని ప్రతి ఒక్కరు ప్రశంసించారు. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో నేచురల్ స్టార్ నానిని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. అయితే రీసెంట్గా వేణు తన క్లోజ్ ఫ్రెండ్ ధనరాజ్‌తో కలిసి ఆలీతో సరదాగా షోకి హాజరయ్యారు. దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో వేణు, ధనరాజ్, అలీ మధ్య సరదా సంభాషణలు జరిగాయి. అలీ ఎవరిగురించో ప్రస్తావించారు. వెంటనే వేణు మాట్లాడుతూ ఆయన చేయి పడ్డవాళ్లంతా స్టార్లు అయ్యారు. నాకు తగల్లేదు అందుకే ఇంత లేట్ అయింది అని చెప్పుకొచ్చాడు.
అయితే ఆలీ.. వేణుని కమర్షియల్ చిత్రాల హవా నడుస్తున్న టైంలో బలగం లాంటి పల్లెటూరి భావోద్వేగాల నేపథ్యంలో సినిమా చేయడానికి కారణం ఏంటి అని ప్రశ్నించారు. దానికి సమాధానం సస్పెన్స్‌గా ఉంచారు. కాకపోతే తనకి ఎలాటి అవమానం ఎదురైందో చెప్పుకొచ్చాడు వేణు. సినిమా మేకింగ్ సమయంలో టెక్నీషియన్స్‌తో చర్చలు జరుపుతున్నాను. అప్పుడు నాతో ఒక టెక్నీషియన్ నువ్వు ఏదో పెద్ద బాహుబలి సినిమా తీస్తున్నట్టు ఫీలవుతున్నావ్గా అని అవమానించాడు. అయితే బలగం రిలీజ్ అయ్యాక మీరు చూసి ఇది చిన్న సినిమాల్లో బాహుబలి అని అభినందించడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని ఎమోషనల్ అయ్యాడు వేణు.