Vijay Devarakoda| విజ‌య్ దేవ‌ర‌కొండ బ‌ర్త్ డే..మూడు సినిమాల అప్‌డేట్స్ ఇచ్చారుగా..!

Vijay Devarakoda|  అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్క‌సారిగా అమాంతం క్రేజ్ తెచ్చుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. 1989 మే 9న హైదరాబాద్‏లో జన్మించిన విజయ్… 2011లో నువ్విలా సినిమాతో ఇండ‌స్ట్రీకి న‌టుడిగా పరిచ‌యం అయ్యాడు. కెరీర్ మొద‌ట్లో చిన్న చిన్న పాత్ర‌లు చేసిన విజ‌య్ 2016లో పెళ్లి చూపులు సినిమా

  • By: sn    cinema    May 09, 2024 2:25 PM IST
Vijay Devarakoda| విజ‌య్ దేవ‌ర‌కొండ బ‌ర్త్ డే..మూడు సినిమాల అప్‌డేట్స్ ఇచ్చారుగా..!

Vijay Devarakoda|  అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్క‌సారిగా అమాంతం క్రేజ్ తెచ్చుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. 1989 మే 9న హైదరాబాద్‏లో జన్మించిన విజయ్… 2011లో నువ్విలా సినిమాతో ఇండ‌స్ట్రీకి న‌టుడిగా పరిచ‌యం అయ్యాడు. కెరీర్ మొద‌ట్లో చిన్న చిన్న పాత్ర‌లు చేసిన విజ‌య్ 2016లో పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారాడు. ఆ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అర్జున్ రెడ్డి సినిమా చేసే అవ‌కాశం ద‌క్కింది. ఈ సినిమాతో మ‌నోడి ఫేట్ మారింది. అప్ప‌టి నుండి అత‌ని నుండి రౌడీ హీరోగా పిలుచుకుంటున్నారు. అయితే ఇటీవ‌లి కాలంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హిట్‌, ఫ్లాప్స్ అనే సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. రొమాంటిక్, కామెడీ, మాస్ యాక్షన్ ఇలా అన్ని ర‌కాల జాన‌ర్స్‌లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు

గీతా గోవిందం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన ద‌ర్శ‌కుడితో చివ‌రిగా ఫ్యామిలీ స్టార్ చిత్రం చేశాడు విజ‌య్. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ని చాలా నిరాశ‌ప‌ర‌చింది. దాంతో ప‌క్కా హిట్ కొట్టాల‌ని దిల్ రాజు నిర్మాణంలో రాజావారు రాణిగారు సినిమా దర్శకుడు రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమాకి క‌మిట‌య్యాడు. ఈ చిత్రం రూరల్ యాక్షన్ డ్రామా కథతో సినిమా ఉండబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు.ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న మూడు సినిమాల‌కి సంబంధించిన క్రేజీ అప్‌డేట్స్ వ‌చ్చాయి. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ డ్రామా రూపొంద‌నుండ‌గా, ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు.ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ గూఢ‌ఛారి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. అనిరుథ్ మూవీకి సంగీతం అందించ‌నున్నారు.

ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ 13వ సినిమాగా ర‌వికిర‌ణ్ కోలా ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొంద‌నుంది. కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే.. అంటూ రక్తంతో తడిచిన చేయి ఓ కత్తిని పట్టుకొని ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ఊర మాస్ గా కనిపించబోతున్నట్టు అర్ధమవుతుంది. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. అందుకే అన్ని భాషల్లోనూ ఈ పోస్టర్ రిలీజ్ చేయడం గమనార్హం. ఇక రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలోను ఒక సినిమా చేయనున్నాడు. విజయ్ – రాహుల్ కాంబినేషన్లో గతంలో ‘టాక్సీవాలా’ సినిమా రాగా, ఈ మూవీ మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరు క‌లిసి మ‌రో ప్రాజెక్ట్ చేయ‌బోతున్నారు. రీసెంట్‌గా కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ను చూడగానే ఇది డిఫరెంట్ కంటెంట్ తో కూడిన కథ అనే విషయం అర్థమవుతోంది. 1854 నుండి 1878 మధ్య కాలంలో జరిగే కథగా మూవీని రూపొందించ‌నున్న‌ట్టు స‌మాచారం. ‘ది లెజెండ్ కర్స్డ్ ల్యాండ్’ అంటూ అంచ‌నాలు భారీగా పెంచారు. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.