Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి ప్రేమికులు వివాహ బంధంతో ఒక్క‌ట‌వుతారు..!

Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి రోజు, ప్ర‌తి వారం త‌మ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా వ్య‌క్తులు త‌మ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తుంటారు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Oct 19, 2025 6:30 AM IST
Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి ప్రేమికులు వివాహ బంధంతో ఒక్క‌ట‌వుతారు..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదల ఉంటుంది. వృత్తి పరంగా స్థిరత్వం లభిస్తుంది. ఆర్థికంగా కలిసివచ్చే సమయం. ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. విహారయాత్రలకు వెళ్తారు. విందువినోదాలలో పాల్గొంటారు. వైవాహిక జీవితం మాధుర్యంగా ఉంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రేమికులకు కలిసివచ్చే కాలం. వ్యాపారులకు ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, పెరుగుతున్న ఖర్చులు ఒత్తిడి కలిగిస్తాయి.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు చట్టపరమైన వ్యవహారాల్లో విజయం సాధించవచ్చు. మంచి లాభాలు కూడా గడిస్తారు. వ్యాపార సంబంధిత ప్రయాణాలు, అధిక ఖర్చులు ఉండవచ్చు. కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి. వ్యక్తిగత, వృత్తి జీవితం మధ్య సమతుల్యతను పాటించడం వల్ల మీ సమర్థత పెరుగుతుంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. వివాహితులకు గృహ జీవితంలో సమస్యలు ఉండవచ్చు కాబట్టి సున్నితంగా వ్యవహరించాలి.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం విశేషమైన ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. అన్ని వైపులా నుంచి ధనప్రవాహం ఉంటుంది. వ్యాపారంలో గతంలో ఆగిపోయిన సొమ్ము చేతికి అందుతుంది. స్థిరాస్తి రంగం వారు కొనుగోలు అమ్మకాల ద్వారా మంచి లాభాలను గడిస్తారు. గత పెట్టుబడుల నుంచి కూడా లాభపడతారు. ఉద్యోగులు నూతన బాధ్యతలను చేపడతారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు అందుకుంటారు. ముందుచూపుతో వ్యాపారాన్ని లాభాలబాటలో నడిపిస్తారు. ఆశించిన లాభాలను అందుకుంటారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. వృత్తి పట్ల అంకిత భావం చిత్తశుద్ధి అవసరం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు విజయం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగులకు స్థాన చలనం ఉండవచ్చు. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. ఇల్లు, భూములు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు ప్రభుత్వ సంబంధిత పనులలో విజయం సాధించవచ్చు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు మంచి అవకాశాలను పొందుతారు. వ్యాపారులు ఆశించిన పురోగతి సాధిస్తారు. విదేశీ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కన్నా మెరుగ్గా ఉంటుంది. రుణభారం తగ్గుతుంది. వృత్తి పరంగా మీ కృషి మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ప్రేమలో ఉన్నవారు శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ వారం సంతోషంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. కుటుంబంలో వేడుకలు జరుగుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో పనిభారం పెరగడంతో స్వల్ప ఒత్తిడి ఉంటుంది. వ్యాపారంలో స్థిరమైన నిర్ణయాలు ప్రయోజనం కలిగిస్తాయి. వ్యాపారులు వారం ప్రారంభంలో దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు వీడి సానుకూల దృక్పథంతో ఉంటే విజయం సాధ్యమవుతుంది. గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తే అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలు వివాహబంధంగా మారుతాయి.

తుల (Libra)

తులారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వారం ప్రారంభంలో వృత్తి వ్యాపారాలలో సవాళ్లను ఎదుర్కొంటారు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. సహోద్యోగుల సహకారంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వారం మధ్యలో పని ఒత్తిడి తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. కుటుంబ విషయాల్లో సహనంతో మెలగాలి. కోపావేశాలు అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళతారు. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. శ్రమకు తగిన ఫలితాలను పొందుతారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కాలం సహకరిస్తోంది. ఉద్యోగులకు పదోన్నతులు, కోరుకున్న చోటికి బదిలీలు ఉంటాయి. అదనపు ఆదాయ వనరులతో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి సత్ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో మంచి పురోగతి సాధిస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. కోర్టు వ్యవహారాల్లో నిర్ణయం మీకు అనుకూలంగా ఉండవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మధురస్మృతులు నెమరువేసుకుంటారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృతి వ్యాపారాలలో మెరుగైన ప్రయోజనాలు అందుకుంటారు. పని పట్ల శ్రద్ధ, పట్టుదల లోపించకుండా జాగ్రత్త పడండి. వ్యాపారులు ఆటంకాలను సమర్థవంతంగా అధిగమిస్తారు. పెట్టుబడులు, లాభాలు పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత విషయాలలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మేలు. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో తీవ్రమైన పోటీ, సవాళ్లు ఉన్నప్పటికినీ అధిగమిస్తారు. పట్టుదల, సమయస్ఫూర్తితో విజయాలను సాధిస్తారు. వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఇంటికి బంధువులు రావడంతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు సకాలంలో అన్ని పనులు పూర్తిచేసి, పదోన్నతులు, ఆర్థిక లాభాలు పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు శుభవార్తలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప ప్రయత్నంతోనే విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో సవాళ్ళను ధైర్యంగా స్వీకరించి ముందుకెళ్తారు. మీ ప్రతిభతో ఎలాంటి అవరోధాలనైనా అవలీలగా ఎదురుకొంటారు. దైవబలం కాపాడుతుంది. వృత్తిలో ప్రగతి గోచరిస్తోంది. శత్రువులు పొంచి ఉన్నారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. వ్యాపారులు వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ పెంచాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, వ్యాపార విస్తరణ చేయాలనుకునేవారికి శుభ సమయం నడుస్తోంది. ఉద్యోగులు ఆశించిన ప్రమోషన్ పొందుతారు. ఆర్థికంగా ఎదుగుతారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతానం పురోగతి ఆనందం కలిగిస్తుంది. బంధు మిత్రులతో విహార యాత్రలకు వెళతారు. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మునుపెన్నడూ లేనంతగా ఆదాయం వృద్ధి చెందుతుంది. వారాంతంలో ప్రయాణాలు అనుకూలం.