Accident | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
Accident | మహారాష్ట్రలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. నందర్‌బర్ జిల్లాలో ఓ మినీ ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ముంబై : మహారాష్ట్రలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. నందర్‌బర్ జిల్లాలో ఓ మినీ ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
నందర్‌బర్ జిల్లా పరిధిలోని చందసైలి ఘాట్ సెక్షన్‌లో రాత్రి 10.30 గంటల సమయంలో మినీ ట్రక్కు లోయలో పడిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో హుటాహుటిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఎనిమిది మంది ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన 15 మందిని చికిత్స నిమిత్తం నందర్‌బర్ జిల్లా కేంద్రంలోని సబ్ డిస్ట్రిక్ట్, సివిల్ హాస్పిటల్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
బాధితులంతా.. ఒకే గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఓ జాతర నిమిత్తం వారంతా మినీ ట్రక్కులో వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.