Vijay|తొలి స్పీచ్‌లోనే అద‌ర‌గొట్టిన విజ‌య్..బీజేపీ మా సైద్ధాంతిక విరోధి… డీఎంకే మా రాజకీయ ప్రత్యర్థి

Vijay|త‌మిళ‌నాట రాజ‌కీయాలు రంజుగా మార‌డం ఖాయం. కొన్ని సంవ‌త్స‌రాల క్రితం క‌మ‌ల్ హాస‌న్ రాజ‌కీయాల్లోకి రాగా ఆయ‌న అంత ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. ర‌జనీకాంత్ వ‌ద్దామ‌నుకున్న అనారోగ్యం వ‌ల‌న త‌ప్పుకున్నారు. ఇక ఇప్పుడు విజ‌య్ టైం వ‌చ్చింది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(vijay) తమిళ వెట్రి కజగం(Tamil Vetri Kazhagam) పార్టీని ఏర్పాటు చేసి రాజ‌కీయాల్లో త‌న స‌త్తా నిరూపించేందుకు అడుగులు వేస్తున్నారు. గ‌త రాత్రి తమిళగ వె

  • By: sn    cinema    Oct 28, 2024 8:05 AM IST
Vijay|తొలి స్పీచ్‌లోనే అద‌ర‌గొట్టిన విజ‌య్..బీజేపీ మా సైద్ధాంతిక విరోధి… డీఎంకే మా రాజకీయ ప్రత్యర్థి

Vijay|త‌మిళ‌నాట రాజ‌కీయాలు రంజుగా మార‌డం ఖాయం. కొన్ని సంవ‌త్స‌రాల క్రితం క‌మ‌ల్ హాస‌న్ రాజ‌కీయాల్లోకి రాగా ఆయ‌న అంత ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. ర‌జనీకాంత్ వ‌ద్దామ‌నుకున్న అనారోగ్యం వ‌ల‌న త‌ప్పుకున్నారు. ఇక ఇప్పుడు విజ‌య్ టైం వ‌చ్చింది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(vijay) తమిళ వెట్రి కజగం(Tamil Vetri Kazhagam) పార్టీని ఏర్పాటు చేసి రాజ‌కీయాల్లో త‌న స‌త్తా నిరూపించేందుకు అడుగులు వేస్తున్నారు. గ‌త రాత్రి తమిళగ వెట్రి కళగం (TVK)పార్టీ నిర్వహించిన సభలో విజయ్ మాట్లాడుతూ అనేక ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.ద్రవిడాన్ని, తమిళ జాతీయతను తమ పార్టీ వేరుగా చూడదని స్పష్టం చేశారు. ఈవీఆర్‌ పెరియార్‌, కే కామరాజ్‌ లాంటి నేతల ఆశయాలకు అనుగుణంగా తమ పార్టీ లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలతో ఏర్పడిందన్నారు.

ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని వారు ద్రవిడ మోడల్ ప్రభుత్వంగా పిలుస్తున్నారని అధికార పార్టీపై మండిపడ్డారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ సినీ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారని, వారు రాజకీయ రంగంలో ప్రవేశించిన అనంతరం కూడా తమ సేవా కార్యక్రమాలతో ప్రజల మనసులను దోచుకున్నారని పేర్కొన్నారు. బీజేపీతో తాము సిద్ధాంతపరంగా విభేదిస్తామని, డీఎంకే పార్టీని రాజకీయంగా వ్యతిరేకిస్తామని చెబుతూ విజయ్ తమ పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. సమాజంలో చీలికలు తీసుకువచ్చేందుకు ఓ గ్రూప్ ప్రయత్నిస్తోందని, సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించేవాళ్లు తమకు మొదటి శత్రువులని విజయ్ ఉద్ఘాటించారు.

రాజకీయం అనేది సినిమా రంగం లాంటిది కాదని, ఇది ఒక యుద్ధభూమి అని చెప్పారు. ఇక్కడ కొంచెం సీరియస్‌గానే ఉంటుందన్నారు. పాము అయినా, రాజకీయం అయినా దానిని సీరియస్‌గా తీసుకోవాలా? లేదా నవ్వుతూ చేతుల్లోకి తీసుకోవాలా? అనేది మనమే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు.రాజకీయాల్లో మమ్మల్ని పిల్లలమంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ అమితమైన ఆత్మవిశ్వాసంతో మనం సర్పం (రాజకీయం)తో ఆడుకునే పిల్లలం. పెరియార్‌ ఈవీ రామస్వామి, కె.కామరాజ్‌, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, వేలు నాచియార్‌, అంజలి అమ్మాళ్‌ ఆశయాలతో పార్టీని నడిపిస్తాం” అని విజయ్‌ అన్నారు. తమ పార్టీ లింగ సమానత్వానికి పెద్దపీట వేస్తుందని చెప్పుకొచ్చారు. వన్ కమ్యూనిటీ, వన్ గాడ్ అనే సిద్ధాంతంతో తమ పార్టీ ముందుకు వెళ్తుందని ఆవిర్భావసభలో విజయ్ ప్రసంగించారు.విల్లుపురం సమీపంలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ మొదటి మహానాడు సభకు దాదాపు ఎనిమిది ల‌క్ష‌ల మంది హాజ‌రయ్యార‌ని అంచ‌నా.