Vijay|ఒంటి నిండా గాయాల‌తో స్టార్ హీరో విజ‌య్.. ఏం జ‌రిగిందంటూ అభిమానుల టెన్ష‌న్

Vijay| త‌మిళ స్టార్ హీరో విజ‌య్‌కి తెలుగులోను మంచి క్రేజ్ ఉంది. ఆయ‌న న‌టించిన చాలా సినిమాలు తెలుగులోను విడుద‌లై ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తూ ఉంటాయి. మాస్ హీరోగా కోట్లాది మంది ప్రేక్ష‌కుల అభిమానాన్ని సంపాదించుకున్న విజ‌య్ ఇటీవ‌ల రాజ‌కీయాల‌లోకి కూడా వ‌చ్చారు. కొత్త పార్టీని ప్ర‌క‌టించి రానున్న ఎల‌క్ష‌న్స్‌కి స‌న్న‌ద్ధం అవుతున్నారు. ఇక ఇప్పటి వ‌ర‌కు క‌మిటైన సినిమాల‌న్నీ పూర్తి చేసి త‌న పూర్తి దృష్టి రాజ‌కీయాల‌పైనే పెడ‌తాడ‌ని అంటు

  • By: sn    cinema    Apr 20, 2024 7:15 AM IST
Vijay|ఒంటి నిండా గాయాల‌తో స్టార్ హీరో విజ‌య్.. ఏం జ‌రిగిందంటూ అభిమానుల టెన్ష‌న్

Vijay| త‌మిళ స్టార్ హీరో విజ‌య్‌కి తెలుగులోను మంచి క్రేజ్ ఉంది. ఆయ‌న న‌టించిన చాలా సినిమాలు తెలుగులోను విడుద‌లై ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తూ ఉంటాయి. మాస్ హీరోగా కోట్లాది మంది ప్రేక్ష‌కుల అభిమానాన్ని సంపాదించుకున్న విజ‌య్ ఇటీవ‌ల రాజ‌కీయాల‌లోకి కూడా వ‌చ్చారు. కొత్త పార్టీని ప్ర‌క‌టించి రానున్న ఎల‌క్ష‌న్స్‌కి స‌న్న‌ద్ధం అవుతున్నారు. ఇక ఇప్పటి వ‌ర‌కు క‌మిటైన సినిమాల‌న్నీ పూర్తి చేసి త‌న పూర్తి దృష్టి రాజ‌కీయాల‌పైనే పెడ‌తాడ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం అయితే వెంకట్ ప్రభు దర్శకత్వంలో గోట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజ‌య్ డ‌బుల్ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తుంది. గోట్ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.

మూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న‌ట్టు స‌మాచారం. అయితే ఈ సినిమా చివ‌రి షూటింగ్ ర‌ష్యాలో జ‌రుగుతుంది. అయితే విజ‌య్ తాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల కోసం ఇండియాకి వ‌చ్చాడు. అయితే ఇండియాకి వ‌చ్చేందుకు విజ‌య్ కొంచెం ఎక్క‌వ రిస్కే తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. వరదల కారణంగా దుబాయ్‌లో విమానాల రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడ‌డంతో ఆయ‌న మాస్కో చేరుకుని అక్కడి నుంచి చెన్నై చేరుకున్నారు. ఇక చెన్నైకి వచ్చిన ఆయన ఓటు వేసి వెంటనే వెళ్లిపోయారు. గత ఎన్నికల సమయంలో సైకిల్ పై ఓటు వేసేందుకు వచ్చిన నటుడు విజయ్ ఈసారి కారులో ఓటు వేయ‌డానికి వ‌చ్చాడు.

విజ‌య్ త‌న ఓటుని నీలాంగరైలోని వేల్స్ స్కూల్‌లో వినియోగించుకున్నాడు. విజ‌య్ వ‌చ్చాడ‌ని తెలిసి అత‌నిని అభిమానులు చుట్టుముట్టారు. అక్క‌డ కొద్ది సేపు తోపులాట జ‌రిగింది. అయితే విజ‌య్ ఓటు వేయ‌డానికి వ‌చ్చిన‌ప్పుడు అంద‌రు కూడా అత‌ని చేతికి ఉన్న గాయాన్ని గ‌మ‌నించారు. విజ‌య్‌కి ఏమైందంటూ ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు. అయితే సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న చ‌ర్చ ప్ర‌కారం విజయ్ షూటింగ్‌లో గాయ‌ప‌డ్డాడ‌ని, అందుకే తన చేతికి మరియు తలకు గాయం అయిన‌ట్టు తెలుస్తుంద‌ని అంటున్నారు. గాయం వ‌ల్ల విజ‌య్ అంత హుషారుగా క‌నిపించ‌డం లేదని అంటున్నారు. రష్యాలో బైక్ ఛేజింగ్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా విజయ్ గాయ‌ప‌డ్డ‌ట్టు టాక్ వినిపిస్తుంది.