Thalapathy Vijay| అత్యుత్సాహం కొంప ముంచింది.. అభిమాన న‌టుడి పుట్టిన రోజు వేడుక‌లో బాలుడికి అంటుకున్న మంట‌లు

Thalapathy Vijay| కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న‌కి త‌మిళంలోనే కాక తెలుగులో కూడా విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఈ రోజు విజ‌య్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌మిళ‌నాట సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇక విజ‌య్‌కి సినీ ప్రముఖులు, అభిమాను

  • By: sn    cinema    Jun 22, 2024 5:15 PM IST
Thalapathy Vijay| అత్యుత్సాహం కొంప ముంచింది.. అభిమాన న‌టుడి పుట్టిన రోజు వేడుక‌లో బాలుడికి అంటుకున్న మంట‌లు

Thalapathy Vijay| కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న‌కి త‌మిళంలోనే కాక తెలుగులో కూడా విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఈ రోజు విజ‌య్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌మిళ‌నాట సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇక విజ‌య్‌కి సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక విజ‌య్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న అభిమానులకు కిక్కిచ్చే అప్డేట్ చేశారు మేకర్స్. ప్రస్తుతం విజ‌య్ ది గోట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచ‌నాలు భారీగా ఉండ‌గా, తాజాగా ది గోట్ నుంచి స్పెషల్ గ్లింప్స్ షేర్ చేశారు. మొత్తం 50 సెకన్లు నిడివి ఉన్న ఈ వీడియోలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇద్దరు విజయ్ లు బైక్ పై వెళ్తుంటే విలన్స్ ఛేజింగ్ చేసే సీన్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇక ఇదిలా ఉంటే విజ‌య్ బ‌ర్త్ డే సంద‌ర్బంగా చాలా రక్తదానాలు, అన్న‌దానాలు చేసారు. ఇంకొంద‌రు కాస్త అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి నిప్పుతో చెల‌గాటం ఆడారు. చెన్నై నీలాంగరైలో మాత్రం ఓ గ్రూప్ విన్యాసాలు చేయాల‌ని చూసింది. నిప్పు అంటించుకున్న చేత్తో పెంకులు పగలకొట్టే ప్రయత్నం చేశాడో బాలుడు. పెంకులైతే పగిలాయి గానీ.. చేతికి అంటించుకున్న నిప్పు చ‌ల్లార‌క‌పోవ‌డంతో పాటు మిగ‌తా ఇద్ద‌రికి కూడా ఆ నిప్పు అంటుకుంది. వెంట‌నే చుట్టు ప‌క్క‌ల వారు నిప్పులు ఆర్పారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతుంది.

ఇక విజ‌య్ రాజ‌కీయాల‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో విజ‌య్ పోటీ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఆ స‌మ‌యంలో విజ‌య్ సినిమాల‌కి బ్రేక్ ఇవ్వ‌నున్న‌ట్టు స‌మాచారం.. ఇక విజ‌య్‌కి కార్లు అంటే చాలా ఇష్టం. తొలినాళ్లలో అతడి వద్ద ఉన్న కొన్ని కార్లు ఇప్పుడు కనిపించకుండా పోయాయని… మొత్తం 20 కార్ల వరకూ విజయ్ కలిగి ఉన్నారటి తెలుస్తోంది. కొత్త కలెక్షన్లతో విలాసవంతమైన కార్లు విడుదలైతే మన దళపతి వెంట‌నే కొనుగోలు చేస్తాడ‌ట‌.