Vishwak Sen| విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా మే 31న విడుదల కానుండగా, మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల
Vishwak Sen| విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా మే 31న విడుదల కానుండగా, మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు నటసింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్లో వేదికపైకి వచ్చిన తర్వాత సినీనటి అంజలిని బాలయ్య నెట్టివేయడం పెద్ద వివాదాస్పదంగా మారింది. వీడియోలో బాలయ్య..అంజలిని నెట్టడంపై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ సమయంలో విశ్వక్ సేన్ ఆ వివాదంపై స్పందించారు.
యూనిట్‌తో కలిసి బాలయ్య ఫోటోలకు పోజులు ఇచ్చే క్రమంలో అంజలిని పక్కకు జరగమని అన్నారు.. అయితే ఆమె సరిగా వినిపించుకోలేదు, దీంతో బాలయ్యను ఆమెను సరదాగా పక్కకు నెట్టారు.. తొలుత అంజలి షాక్ అయినా, తర్వాత ఆ విషయాన్ని సరదాగా తీసుకుని నవ్వుకుంది. ఆ వెంటనే బాలకృష్ణకు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చింది. ఈవెంట్లో జరిగింది వేరు, సామాజిక మాధ్యమాల్లో చూపించేది వేరని విశ్వక్ సేన్ తెలిపాడు. వీడియోను ముందు, వెనుక కట్ చేసి కావాలనే వైరల్ చేస్తున్నారని.. బాలయ్య అందరితో సరదాగా ఉంటారని .. ట్రోలింగ్ ఆపాలని విశ్వక్సేన్ సూచించారు.
ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాలయ్య మందు తాగి వచ్చారని, ఆయన సీటు పక్కన మద్యం బాటిల్‌ను హైలైట్ చేస్తూ తెగ ట్రోల్ చేశారు. దీనిపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందిస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మద్యం బాటిల్ నిజం కాదని.. మంచినీటి సీసాలో మందు ఉన్నట్లు సీజీ చేసి బాలకృష్ణను ట్రోల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా ఈ ఈవెంట్లో ఉన్నామని.. అక్కడేం జరిగిందో మాకు తెలియదా అంటూ నాగవంశీ ప్రశ్నించారు. అంజలి ఇష్యూని కూడా వదిలేయండి అని నిర్మాత చెప్పారు. మరి ఇప్పటికైన ఈ వివాదం సద్దుమణుగుతుందా లేదా అనేది చూడాలి.