Vishwak sen| ఆ హీరోయిన్ కార‌ణంగా విశ్వ‌క్ సేన్ ఇన్‌స్టాకి దూరం అయ్యాడా.. క్లారిటీ ఇచ్చిప‌డేశాడుగా..!

Vishwak sen| యువ హీరో విశ్వక్ సేన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హిట్, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటాడు. విభిన్న క‌థ‌లు ట్రై చేస్తున్న విశ్వక్ సేన్ మంచి హిట్ కోసం త‌పిస్తున్నాడు. అయితే ఈ ఏడాది విశ్వక్ సేన్ నుంచి గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావ

  • By: sn    cinema    Jul 29, 2024 7:05 AM IST
Vishwak sen| ఆ హీరోయిన్ కార‌ణంగా విశ్వ‌క్ సేన్ ఇన్‌స్టాకి దూరం అయ్యాడా.. క్లారిటీ ఇచ్చిప‌డేశాడుగా..!

Vishwak sen| యువ హీరో విశ్వక్ సేన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హిట్, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటాడు. విభిన్న క‌థ‌లు ట్రై చేస్తున్న విశ్వక్ సేన్ మంచి హిట్ కోసం త‌పిస్తున్నాడు. అయితే ఈ ఏడాది విశ్వక్ సేన్ నుంచి గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రాలు కూడా పెద్ద‌గా ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌లేక‌పోయాయి. ఇక ఈ ఏడాది విశ్వ‌క్ సేన్ న‌టించిన మ‌రో చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ర‌వితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాఖీ చిత్రం అక్టోబర్ 31న రిలీజ్ కి సిద్దంగా ఉంది.

ఈ క్రమంలో చిత్ర టీజ‌ర్ రీసెంట్‌గా విడుద‌ల చేశారు. టీజ‌ర్ అంద‌రిని ఆక‌ట్టుకుంది.ఇక టీజ‌ర్ లాంచ్ కార్యక్ర‌మంలో మీడియా అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కి ఆస‌క్తిక‌ర స‌మాధానాలు ఇచ్చాడు విశ్వక్ సేన్. ఓ రిపోర్ట‌ర్ .. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఎందుకు డీయాక్టివేట్ చేశారు.. ఎవరైనా హీరోయిన్ కారణమా అని విశ్వ‌క్ సేన్‌ని అడిగారు. అందుకు విశ్వక్ సేన్ స‌మాధానం ఇస్తూ… నేను ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని హీరోయిన్ వల్లో ఇంకొకరి వల్లో డీయాక్టివేట్ చేయలేదు. నాకు వయసు 30 ఏళ్ళు వస్తోంది. ఇక ఫోన్ లో ఎక్కువ సమయం గడపకూడదు అని నిర్ణయించుకుని ఆ నిర్ణ‌యం తీసుకున్నాను. ఇక‌ వర్క్ పై ఫోకస్ పెడదామనుకుంటున్నా. సినిమా రిలీజ్ కి ముందు యాక్టివ్ చేసి మళ్ళీ డీయాక్టివ్ చేసేస్తా అని విశ్వక్ సేన్ తెలిపారు.

మెకానిక్ రాకీ చిత్రం విష‌యానికి వ‌స్తే.. ఈ మూవీలో విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా నటిస్తున్నారు. శ్రద్ద శ్రీనాథ్, సునీల్, నరేశ్, హైపర్ ఆది, హర్షవర్దన్, వైవా హర్ష కీలకపాత్రలు పోషిస్తున్నారు. జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తుండ‌గా, ఈ మూవీని ఎస్ఆర్‌టీ ఎంటర్‌టై‍న్‍మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మరోవైపు విశ్వక్ సేన్ లైలా అనే చిత్రంలో కూడా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో లేడి గెట‌ప్‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నాడు. ఇక జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీతోనూ ఓ మూవీకి విశ్వక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.