మణుగూరులో గంజాయి.. కూకట్‌పల్లిలో డ్రగ్స్ పట్టివేత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఏపీ డొంకరాయి నుంచి మణుగూరు మీదుగా మామిడి కాయల మాటున ట్రాలీలో తెలంగాణలోని జహీరాబాద్‌కు తరలిస్తుండగా 477 కేజీల గంజాయి లభ్యమైంది. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

విధాత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఏపీ డొంకరాయి నుంచి మణుగూరు మీదుగా మామిడి కాయల మాటున ట్రాలీలో తెలంగాణలోని జహీరాబాద్‌కు తరలిస్తుండగా 477 కేజీల గంజాయి లభ్యమైంది. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 1.19 కోట్లు ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు హైదరాబాద్ కూకట్ పల్లిలో వడ్డెపల్లి ఎన్‌క్వేల్‌లో డ్రగ్ పెడ్లర్ షేక్ ఫరూక్‌ను పట్టుకుని 4.1గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు.