క‌డుపులో రూ.11 కోట్ల విలువైన‌ కొకైన్ దాచాడో ఆఫ్రిక‌న్

విధాత‌: బెంగళూరు ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు అక్రమంగా తరలిస్తున్న మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. ఆఫ్రికన్‌ దేశస్తుడి నుంచి దాదాపు రూ. 11 కోట్ల విలువైన కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి బెంగళూరుకు వచ్చిన ఆఫ్రికా దేశస్తుడు విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఆహారం, మంచినీరు తీసుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు అతడిని స్కాన్‌ చేయగా.. పొట్టలో కొకైన్‌ ఉన్నట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వైద్యుల సహాయంతో అతని కడుపులోంచి కొకైన్‌ను బయటికి తీయ‌గా దాని […]

క‌డుపులో రూ.11 కోట్ల విలువైన‌ కొకైన్ దాచాడో ఆఫ్రిక‌న్

విధాత‌: బెంగళూరు ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు అక్రమంగా తరలిస్తున్న మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. ఆఫ్రికన్‌ దేశస్తుడి నుంచి దాదాపు రూ. 11 కోట్ల విలువైన కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి బెంగళూరుకు వచ్చిన ఆఫ్రికా దేశస్తుడు విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఆహారం, మంచినీరు తీసుకోలేదు.

దీంతో అనుమానం వచ్చిన అధికారులు అతడిని స్కాన్‌ చేయగా.. పొట్టలో కొకైన్‌ ఉన్నట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వైద్యుల సహాయంతో అతని కడుపులోంచి కొకైన్‌ను బయటికి తీయ‌గా దాని విలువ‌ దాదాపు రూ. 11 కోట్లు ఉంటుందని అధికారులు వెల్ల‌డించారు.