Ex-Boyfriend Attacks His Girlfriend With Bike | బ్రేక్ అప్ చెప్పిందని.. యువతిని బైక్ తో ‘ఢీ’ కొట్టిన మాజీ ప్రేమికుడు
మధ్యప్రదేశ్ ఇండోర్‌లో బ్రేక్ అప్ చెప్పిందన్న కోపంతో మాజీ ప్రియుడు బైక్‌తో ఢీ కొట్టి యువతిని గాయపరిచాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్.

విధాత : యువతీ యువకుల ప్రేమలు నేటి రోజుల్లో విచక్షణ రహితంగా మారిపోతున్నాయి. ప్రేమలు పెళ్లి వరకు రాలేకపోతే..నీ సుఖమే నీ కోరుకున్నానంటూ విరహా గీతాలతో విడిపోయే త్యాగాల ప్రేమలకు కాలం చెల్లి ప్రతికార ప్రేమలు రాజ్యమేలుతున్నాయి. ప్రేమించలేదంటూ ఒకడు ప్రియురాలిపై యాసిడ్ దాడికి పాల్పడితే..మరికొందరు కత్తులతో హత్యలు..హత్యాయత్నాలు చేస్తున్నారు. ఇంకొందరు ఎలాగు ఇక నాకు దక్కదనుకుంటే చాలు వేధింపులకు గురిచేస్తున్నారు. ఇదంతా ప్రేమే? కానే కాదు. ఇది కేవలం కరుడుకట్టిన స్వార్థం.. కామం. తాజాగా ఓ యువకుడు తన ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టేసిందన్న కోపంతో తన ప్రియురాలిని బైక్ తో గుద్ది అక్సిడెంట్ చేసిన ఘటన వైరల్ గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ లో చోటు చేసుకుంది.
ఇండోర్ కు చెందిన యువతిని స్థానిక యువకుడు కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. ఏమైందో ఏమోగాని ఇటీవల ఆ యువతి తన బాయ్ ఫ్రెండ్ ప్రేమక బ్రేక్ అప్ చెప్పేసింది. అతనికి దూరంగా ఉంటుంది. దీనిని సహించలేని యువకుడు ఆ యువతిపై కోపం పెంచుకుని..రోడ్డుపై వెలుతున్న సమయంతో ఎదురుగా వెళ్లి బైక్ తో ఢీ కొట్టి పారిపోయాడు. మాజీ ప్రేమికుడి దాడిలో గాయపడిన యువతి గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇవేం ప్రేమలు..ఇది ఉన్నాదం అంటూ కామెంట్లు పెడుతున్నారు. సాధ్యమైనంత నిస్వార్థముగా ప్రేమించాలని.. ఒక వేళా అవతలి వ్యక్తి మనల్ని కాదన్నా.. మనము దాన్ని ఒప్పుకోవాలని.. ఆ వ్యక్తి మంచి కోరాలని సూచిస్తున్నారు. ” నిజమైన ప్రేమ ఎప్పుడు ఏమి ఆశించదని..ప్రేమ సంతోషాన్నిస్తుందని.. కామం దుఖఃన్నిస్తుందిస్తుందని.. మనం కామాన్ని ప్రేమ అని భ్రమపడితే మనదే తప్పు అని.. నిస్వార్థంగా ప్రేమిస్తే ప్రేమ అనేది పిశాచి కాదు.. దేవత అవుతుందంటూ స్వామి వివేకానందా సూక్తులను గుర్తు చేస్తున్నారు .