యాదాద్రి కలెక్టరేట్లో కత్తిపోటుల కలకలం !
విధాత : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల మధ్య ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది. ఆత్మకూర్ మండల వ్యవసాయ శాఖ అధికారిణి శిల్ప, యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట ఏఈవో మనోజ్‌ల మధ్య వాగ్వివాదం ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో శిల్పపై మనోజ్ కత్తితో దాడి చేయగా, అదే కత్తితో ఆమె మనోజ్‌పై దాడి చేసింది. కార్యాలయ ఉద్యోగులు మనోజ్‌ను ఆసుపత్రికి తరలించారు. ఆత్మ రక్షణ కోసం దాడి చేయాల్సి వచ్చిందని శిల్ప పేర్కోంది. పోలీసులు ఈ సంఘటనపై విచారణ చేపట్టారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram