ఆత్మహత్యలు చేసుకున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులు
కారణాలు ఏమైనా రెండు వేర్వేరు ఘటనలో వేర్వేరు కళాశాలలకు చెందిన ఇద్దరు బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఒకే రోజు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వారి కుటుంబాల్లో
- గీతం విశ్వవిద్యాలయంలో రేణుశ్రీ ఆత్మహత్య
- నల్ల మల్లారెడ్డి కళాశాలలో విజయ్ ఆత్మహత్య
విధాత : కారణాలు ఏమైనా రెండు వేర్వేరు ఘటనలో వేర్వేరు కళాశాలలకు చెందిన ఇద్దరు బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఒకే రోజు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వారి కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. సంగారెడ్డి గీతం విశ్వవిద్యాలయం విద్యార్థి రేణుశ్రీ భవనంలోని ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రేణుశ్రీ ఆత్మహత్య ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆమె ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై విచారణ చేస్తున్నారు.
ఆమె తల్లిదండ్రులు కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. రేణుశ్రీ భవనంపై నుంచి దూకుతున్న సందర్భంలో వీడియో తీసిన విద్యార్థిని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో యూనివర్సిటీ వద్ధ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఘట్‌కేసర్ నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విజయ్ రైలు కింద పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని మృతదేహాన్ని ఘట్ కేసర్ రైల్వే ట్రాక్‌పై అధికారులు గుర్తించారు. అతని మృతికి కూడా కారణాలు తెలియరాలేదు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram