కుజ దోషంతో బాధపడుతున్నారా..? హనుమంతుడిని ఇలా పూజించండి..!
ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. కుజ దోషంతో బాధపడేవారు కూడా ఉంటారు. కాబట్టి కుజ దోష నివారణకు చక్కటి మార్గం ఏంటంటే.. ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించడమే.

ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. కుజ దోషంతో బాధపడేవారు కూడా ఉంటారు. కాబట్టి కుజ దోష నివారణకు చక్కటి మార్గం ఏంటంటే.. ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించడమే. భక్తిశ్రద్ధలతో ఆంజనేయుడిని పూజిస్తే కుజ దోషం తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. పూజతో పాటు ఉపవాసం కూడా ఉండాలి. హనుమంతుడికి ఎలా పూజ చేయాలి..? ఉపవాస దీక్ష ఎలా చేపట్టాలనే విషయాలను తెలుసుకుందాం..
పూజా విధానం ఇలా..
మంగళవారం తెల్లవారుజామున బ్రహ్మ ముహుర్తంలో మేల్కొనాలి. ఆ తర్వాత అభ్యంగన స్నానం చేయాలి. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇంటి ఈశాన్యమూలలో ఒక పీఠాన్ని ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి, ఆంజనేయుడి చిత్రాన్ని ఉంచాలి. ఆ తర్వాత ఎర్రటి పువ్వులు సమర్పించాలి. పూజా సమయంలో హనుమాన్ చాలీసా తప్పకుండా పఠించాలి. పూజ ముగిసిన అనంతరం, హారతి ఇచ్చి ప్రసాదం పంచాలి. ఇక హనుమంతుడికి పెట్టే నైవేద్యంలో తులసి ఆకులను వేయడం అత్యంత ఫలవంతం.
ఉపవాస దీక్ష విధానం ఇలా..
ఏ నెలలోనైనా శుక్ల పక్షంలోని మొదటి మంగళవారం నుంచి మంగళవారం వరకు ఉపవాస దీక్ష చేపట్టవచ్చు. 21 రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తే మంచిది. 21 రోజుల పాటు ఉపవాసం ఉండడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసాతో పాటు బజరంగ బాన్, సుందరకాండను పఠిస్తే ఎంతో శుభప్రదం.
ఉపవాస దీక్ష వల్ల కలిగే ప్రయోజనాలు..
ఉపవాస దీక్ష చేయడం వల్ల ఆర్థిక సమస్యలు, అప్పులు బాధలు తొలగిపోతాయి. మంగళవారం ఉపవాసం ఉండటం వల్ల వైవాహిక జీవితంలోని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. హనుమంతుడిని సంకట మోచనుడు అని పిలుస్తారు. అందుకే మంగళవారం హనుమంతుడిని పూజించి ఉపవాసాన్ని పాటించడం ద్వారా అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం.