శనితో బాధపడుతున్నారా..? అయితే ఈ రంగు వస్త్రాలు ధరించి శని దేవుడిని పూజించండి..!

ప్రతి ఒక్కరిని శని వెంటాడుతుంది. శని చెడు ప్రభావం మన మీద పడితే వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతుంటాయి. దీంతో జీవితం ముందుకు సాఫీగా సాగదు. కాబట్టి శని భగవానుడి అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై గ్రహస్థితి కలిసి వస్తుంది. అందుకే శని దేవుడిని నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి శనివారం నలుపు రంగు వస్త్రాలు ధరించి శని దేవుడిని పూజిస్తే జీవితంలో వచ్చే ఆటంకాలు, సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శని దేవుడి ఆశీర్వాదం వల్ల కోరిన కోరికలు తీరిపోతాయి.
శని దేవుడికి చేయాల్సిన పూజలు
శనివారం రోజున తెల్లవారుజామున నిద్ర లేచి అభ్యంగ స్నానమాచరించాలి. అనంతరం శని విగ్రహానికి నువ్వుల నూనెతో, నల్ల నువ్వులతో, నల్లని వస్త్రంతో పూజించాలి. ఈ పూజ చేసే వారు కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించాలి. తైలాభిషేకం చేసి శాంతి పూజలు నిర్వహించాలి. తద్వారా దుష్ఠ శక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలి.
పూజా కార్యక్రమం అనంతరం పేదవారికి నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది. అంటే నలుపు వస్త్రాలు, నువ్వులు, నువ్వుల నూనె, ఆకలి తీర్చే భోజనం చేయడానికి ఏవేని ఆహార పదార్ధాలు లాంటివి కేవలం నిరుపేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ,ఆకలితో ఉన్నవారికి, అనారోగ్యంతో ఉన్నవారికి మాత్రమే దానం చేయాలి, అప్పుడే శని దేవుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది.
ఈ మంత్రాన్ని 11 సార్లు జపించాలి..
శని దోషం నుండి బయటపడేందుకు కింద పేర్కొన్న శ్లోకాలను 11 సార్లు జపించాలి. ఈ రెండు శ్లోకాలను స్మరించడంతో పాటు, నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి. ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది. ముఖ్యంగా దాన ధర్మాలు పేదవారికి, ఏమి లేని నిర్భాగ్యులకు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
1. క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి
2. శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే