Broom Vastu Tips | ‘చీపురే’ కదా అని చీప్‌గా చూడకండి..! దాన్ని నిలబెట్టాలా..? పడుకోబెట్టాలా..?
Broom Vastu Tips | చీపురు( Broom )ను చీప్‌గా చూడకండి.. ఇంటి( House )ని పరిశుభ్రంగా ఉంచే చీపురును లక్ష్మీదేవి( Lakshmi Devi ) రూపంగా భావిస్తారు. కాబట్టి చీపురును ఎక్కడ ఉంచాలి.. దాన్ని నిలబెట్టాలా..? పడుకోబెట్టాలా..? అనే విషయాలను తెలుసుకుందాం..
Broom Vastu Tips | హిందూ గ్రంథాల ప్రకారం చీపురు( Broom )కు ఎంతో ప్రాధాన్యత ఉంది. చీపురును హిందువులు లక్ష్మీదేవి( Lakshmi Devi ) చిహ్నంగా భావిస్తారు. ఇంటి( House )ని శుభ్రం చేసే చీపురును చీప్‌గా చూడొద్దు. దీనికి కూడా వాస్తు నియమాలు( Vastu Tips ) ఉన్నాయి. చీపురు విషయంలో వాస్తు నియమాలు పాటించకపోతే.. ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుందని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. మరి చీపురుకు ఉన్న ఆ వాస్తు నియమాలు ఏంటో తెలుసుకుందాం..
చీపురును ఎక్కడ ఉంచాలి..?
ప్రతి ఇంట్లో చీపురు ఉంటుంది. కానీ దాన్ని ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు. అంతేకాకుండా కాలితో తన్నుతుంటారు. అయితే చీపురును ఇతరులకు కనిపించేలా ఉంచకూడదు. చీపురును ఎల్లప్పుడు దాచి ఉంచాలి. వంట గది, పడక గదిలో చీపురును అసలు ఉంచొద్దు. లక్ష్మీదేవి రూపం కాబట్టి చీపురును తన్నకూడదు. నగలు, డబ్బులు ఉంచే ప్రదేశంలో చీపురును అసలు ఉంచొద్దు.
చీపురును నిలబెట్టలా..? పడుకోబెట్టాలా..?
ఇంటిని శుభ్రం చేసే చీపురు పట్ల నిర్లక్ష్యం చూపొద్దని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. విరిగిన చీపురును, అరిగిన చీపురును ఇంట్లో ఉంచుకోవద్దు. ఇంట్లో చీపురును ఎప్పుడూ నిలబెట్టి పెట్టకూడదు. ఇందుకు బదులుగా చీపురుని ఎల్లప్పుడూ పడుకొబెట్టి ఉంచాలి.
చీపురును ఎప్పుడు కొనాలి..?
చీపురును కొనేందుకు ఓ సమయం ఉంది. ఎప్పుడంటే ఎప్పుడు చీపురును కొనుగోలు చేయొద్దని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చీపురును కొనేందుకు శుక్రవారం, మంగళవారం శుభప్రదమైన రోజులుగా భావిస్తారు. శనివారం పాత చీపురును మార్చడానికి మంచి రోజు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram