Vastu Tips for Broom | చీపురును నిలబెట్టారో.. ఇంట్లో నిప్పులే..! జర జాగ్రత్త సుమా..!!
Vastu Tips for Broom | మనం ఇంటిని పరిశుభ్రంగా ఉంచేందుకు ఉపయోగించే చీపురు( Broom )కు కూడా వాస్తు నియమాలు ఉన్నాయి. చీపురు విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా.. ఆ ఇల్లు నిప్పుల కొలిమిలా తయారవుతుందని వాస్తు పండితులు( Vastu Experts ) చెబుతున్నారు. ఇల్లును శుభ్రంగా ఉంచే చీపురు విషయంలో తప్పకుండా వాస్తు నియమాలు( Vastu Tips ) పాటించాలని సూచిస్తున్నారు. మరి ఆ వాస్తు నియమాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
Vastu Tips for Broom | ఇంటిని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి గృహిణి చీపురు( Broom )ను వినియోగిస్తారు. ఇక ఇల్లును శుభ్రం చేసిన తర్వాత చీపురును ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని వాస్తు పండితులు( Vastu Experts ) హెచ్చరిస్తున్నారు. చీపురుకు కూడా వాస్తు నియమాలు( Vastu Tips ) ఉన్నాయని చెబుతున్నారు. చీపురును ఏ రోజు కొనుగోలు చేయాలి..? ఇంట్లో ఏ దిశలో చీపురను ఉంచాలి..? చీపురును పడుకోబెట్టాలా..? నిల్చోబెట్టాలా..? అనే విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ ఈ కథనంలో తెలుసుకుందాం.
చీపురును ఏ దిశలో ఉంచాలి..?
చాలా మంది గృహిణులు చీపురును ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు. ఇది మంచిది కాదట. ఇల్లును శుభ్రం చేసిన తర్వాత చీపురును ఇంట్లోని దక్షిణ, పడమర దిశలోని మధ్య సలంలోనే ఉంచాలట. ఇతర ఏ దిక్కులు కూడా చీపురును ఉంచేందుకు పనికి రావని హెచ్చరిస్తున్నారు.
మరి చీపురును పడుకోబెట్టాలా..? నిలబెట్టాలా..?
ఇక దిశను పక్కన పెడితే చాలా మంది మహిళలు చీపురును నిర్లక్ష్యంగా పడేస్తుంటారు. దాన్ని తొక్కుతూ ఇంట్లోనే తిరుగుతుంటారు. ఇది కూడా మంచి పద్ధతి కాదట. ఇల్లును శుభ్రం చేసిన తర్వాత సరైన దిశలో చీపురును నిలబెట్టకుండా పడుకోబెట్టాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ధన సంబంధిత సమస్యలు ఉండవని పేర్కొంటున్నారు.
చీపురును ఏ రోజు కొనుగోలు చేస్తే శుభప్రదం..?
చీపురును కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. అమావాస్య, మంగళవారం, శనివారం, ఆదివారం రోజుల్లో చీపురును కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. సోమవారం శుక్లపక్షంలో చీపురు కొనడం అశుభమని చెబుతున్నారు. ఇది ఆర్థిక సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram