Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు..!

Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి రోజు, ప్ర‌తి వారం త‌మ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా వ్య‌క్తులు త‌మ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తుంటారు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Feb 22, 2026 7:25 AM IST
Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. వారం ప్రారంభంలో ఉద్యోగంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ క్రమంగా సర్దుకుంటాయి. పదోన్నతులకు అవకాశం ఉంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. వ్యూహాత్మక నిర్ణయాలతో లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి అనువైన సమయం. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే మంచిది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే అధిక ఖర్చులు ఒత్తిడి కలిగించకుండా చూసుకోండి. ప్రేమ వ్యవహారాల్లో వాదనలకు తావు లేకుండా చూసుకోండి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండవచ్చు.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం వృత్తి పరమైన, వ్యక్తిగతమైన విజయాలకు అవకాశాలు బలంగా ఉన్నాయి. ఉద్యోగంలో అధికార యోగం ఉంటుంది. పదోన్నతులు ఉంటాయి. అయితే నియంతృత్వ ధోరణితో ఉండడం మంచిది కాదు. అందరినీ కలుపుకుని ముందుకు పోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. వ్యాపారంలో విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారం గణనీయంగా అభివృద్ధి చెందుతుంది. డబ్బు బాగా సంపాదిస్తారు కానీ వృథా ఖర్చులు నివారించి పొదుపుపై దృష్టి సారిస్తే మంచిది. ప్రేమ వ్యవహారాల్లో ఆనందం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో కలిసి చేసే ప్రయాణాలు ఆహ్లాదంగా సాగుతాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం హెచ్చుతగ్గులతో కూడి ఉంటుంది. ఉద్యోగులు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి. సహచరుల సహకారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. పెట్టుబడులు, లాభాలు పెరగడం ఆనందం కలిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు. ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. ఆదాయం పెరిగినప్పటికీ విలాసాల కోసం చేసే ఖర్చులు కలవరపెడతాయి. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. ఉద్యోగులు పనిప్రదేశంలో సహనంతో నడుచుకోవాలి. వివాదాలు, ఘర్షణలకు దూరంగా ఉండాలి. ఆత్మవిశ్వాసం మంచిదే కానీ మితిమీరిన విశ్వాసం కూడా ఒక్కోసారి నష్టం కల్గిస్తుంది. ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం మంచిది. వ్యాపారులకు ఈ వారం కొంత గడ్డుకాలం. వ్యాపారంలో నష్టాలు సంభవించే అవకాశం ఉంది. సమయానుకూల నిర్ణయాలతో నష్ట ప్రభావం తగ్గవచ్చు. ఆదాయం పెరిగినప్పటికీ అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడపడం వల్ల అపార్ధాలు తొలగుతాయి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం ప్రయోజనకరంగానే ఉన్నప్పటికీ కొంత అప్రమత్తంగా ఉండడం అవసరం. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు ప్రశంసలు లభిస్తాయి. మీ సమర్ధతకు సముచిత గుర్తింపు పొందుతారు. వ్యాపారంలో కొన్ని ఆటుపోట్లు ఉన్నప్పటికీ సందర్భానుసారంగా నడుచుకుంటే సత్ఫలితాలు సాధించవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ప్రేమ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం ఇబ్బందిని కలిగించవచ్చు. వైవాహిక జీవితం సంతృప్తికరంగా ఉంటుంది.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం వృత్తి పరమైన పురోగతి ఉంటుంది. ఉద్యోగులు విజయపథంలో దూసుకెళ్తారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారం అభివృద్ధి చెందడం ఆనందం కలిగిస్తుంది. ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపారాన్ని విస్తరిస్తారు. లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. జీవిత భాగస్వామితో కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేస్తారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం వృత్తిపరంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగంలో శ్రమ పెరగవచ్చు. ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూసే వారు కొత్త అవకాశాలు అందుకుంటారు. వ్యాపారంలో నిర్లక్ష్యం నష్టాలకు దారితీస్తుంది. నష్ట నివారణ కోసం ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో కలహపూరిత వాతావరణం ఉంటుంది. అవగాహనా లోపంతో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరుగుతాయి. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా చదివితే మంచి ఫలితాలు ఉంటాయి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో మెరుగైన ప్రగతి గోచరిస్తోంది. పట్టుదలతో ఉద్యోగ స్థిరత్వం సాధిస్తారు. బాధ్యతాయుతమైన ప్రవర్తనతో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. అయితే ప్రత్యర్థుల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో హెచ్చు తగ్గులు, ఆటుపోట్లు లేని స్థిరమైన పురోగతి ఉంటుంది. లాభాలు పెరగడంతో ఆర్థికంగా పుంజుకుంటారు. కొత్త ప్రాజెక్టులు అందుకుంటారు. వారం ప్రారంభంలో స్వల్పంగా ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ వారాంతానికి ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఆకస్మిక ధనలాభాలకు కూడా ఆస్కారం ఉంది. అపార్థాలు తొలగడంతో ప్రేమ వ్యవహారాల్లో మాధుర్యం చోటు చేసుకుంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం పురోగతి మధ్యస్థంగా ఉంటుంది. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం, అధికారుల మద్దతుతో అన్ని పనులు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. ప్రమోషన్ ఛాన్స్ కూడా ఉంది. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. ప్రభుత్వ పథకాలు మీ వ్యాపారానికి గణనీయమైన ప్రయోజనాన్ని అందించగలవు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వద్దు. తీసుకోవద్దు. మొహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రేమ వ్యహారాల్లో సంయమనం పాటించాలి. కుటుంబం సమస్యలు అశాంతి కల్గితిస్తాయి. జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా చూసుకోండి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ వారం చాలా శుభదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగులు ఉన్నత స్థాయి బాధ్యతలు స్వీకరిస్తారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. జీతం పెరుగుదల వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. వ్యాపారులు వ్యాపార విస్తరణకు అవసరమైన ధనం సమకూర్చుకుంటారు. రుణభారం తొలగుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలతో లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆనందంగా సాగుతాయి. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో స్థిరమైన ప్రగతి గోచరిస్తోంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులకు ఈ వారం మంచి యోగకరంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి అనువైన సమయం. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆదాయం పెరగడం, ఖర్చులు తగ్గడం ఆనందం కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ వారం వృత్తి పరమైన, వ్యక్తిగతమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగంలో కష్టపడి పని చేసినప్పటికి ఆశించిన ఫలితాలు ఉండక పోవచ్చు. అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. వృత్తిరీత్యా దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. బుద్ధిబలం, వ్యూహాత్మక ఆలోచనలతో వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం, డబ్బు పొదుపు చేయడం పాటించాలి. ప్రేమ వ్యవహారాల్లో స్వల్ప సమస్యలు ఉండవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రాకుండా చూసుకోండి.